Begin typing your search above and press return to search.

ఆసక్తిగా హైదరాబాద్ అభ్యర్థుల ఆస్తులు... మాధ‌వీల‌తకు ఎన్ని వందల కోట్లో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసిన సంఅతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2024 11:19 AM GMT
ఆసక్తిగా హైదరాబాద్  అభ్యర్థుల ఆస్తులు... మాధ‌వీల‌తకు ఎన్ని వందల కోట్లో తెలుసా?
X

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసిన సంఅతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు అంతా తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు వారు సమర్పించిన అఫిడవిట్లలో వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాలు ఆసక్తిగా మారాయి. ఈ సమయంలో... హైదరాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులు అసదుద్ధీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత ఆస్తులు వైరల్ గా మారాయి.

అవును... హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాధవీలత నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమె కుటుంబ చరాస్తుల విలువ రూ.165.46 కోట్లు కాగా, స్థిరాస్తుల విలువ రూ.55.92 కోట్లుగా ఆమె వెల్లడించారు. ఇదే క్రమంలో... రూ.27.03 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌ లో పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... విరించి లిమిటెడ్‌, వినో బయోటెక్‌ లలో తన పేరిట రూ.8.92 కోట్ల విలువైన షేర్లు, తన భర్త కొంపెల్ల విశ్వనాథ్‌ పేరిట రూ.56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు మాధవీలత తెలిపారు. అదేవిధంగా... గజ్వేల్‌ డెవలపర్స్‌, పీకేఐ సొల్యూషన్స్‌, విరా సిస్టంస్ లలో తన పేరిట రూ.16.27 కోట్ల షేర్లు, తన భర్త పేరిట రూ.29.56 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఆమె అఫిడవిట్‌ లో పొందుపరిచారు.

ఇక బంగారం విషయానికొస్తే... భార్యాభర్తలు ఇద్దరి పేరిట 5 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్న ఆమె... అందులో 3.9 కిలోలు తన పేరుమీద, మిగిలిన 1.11 కిలోల బంగారు ఆభరణాలు తన భర్త పేరిట ఉన్నట్లు తెలిపారు. అయితే... వారికి ఎలాంటి వ్యవసాయ భూములు కానీ, వాహనాలు కానీ లేవని పేర్కొనడం గమనార్హం.

అస‌దుద్దీన్ ఒవైసీ ఆస్తులు రూ. 23.87 కోట్లు!:

ఇదే హైద‌రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఆస్తుల విలువ రూ. 23.87 కోట్లుగా ప్రకటించారు. వీటిలో చరాస్తులు అసదుద్దీన్ ఓవైసీ పేరు మీద రూ.2.80 కోట్లు, తన భార్య పేరు మీద రూ.15.71 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారు.

ఇదే సమయంలో... స్థిరాస్తుల మార్కెట్ విలువ ప్రకారం అతని పేరు మీద రూ.16.01 కోట్లు ఉన్నాయని.. తన భార్య పేరు మీద రూ. 4.90 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదేవిధంగా... రూ.7 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయ‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌ లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో... ఐదు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయిన‌ట్లు వెల్లడించారు.