Begin typing your search above and press return to search.

గూగుల్ ప్రకటనల్లో ఏ పార్టీ ఖర్చు ఎంతంటే...?

గూగుల్ ప్రకటనల పారదర్శక డేటా ప్రకారం 2023లో బీజేపీ రూ.19 కోట్లు ఖర్చు చేసిందని చూపిస్తుంది. దేశాన్ని

By:  Tupaki Desk   |   5 March 2024 8:16 AM GMT
గూగుల్ ప్రకటనల్లో ఏ పార్టీ ఖర్చు ఎంతంటే...?
X

ఎన్నికల సమయంలో అభ్యర్థి గుణగణాలు, సేవా థృక్పతం, పోటీ చేస్తున్న పార్టీ... ఇవన్నీ ఒకెత్తు అయితే తాను చేసుకునే ప్రచారం మరొకెత్తు! ఒక్క మాటలో చెప్పాలంటే... ఎంత ఎక్కువ ప్రచారం చేసుకుంటే అంత ఫాలోయింగ్ పెరగడం, ఆ ఫాలోయింగ్ ఓట్లుగా మారుతుండటం జరుగుతుంటుందని అంటుంటారు. అలా అని కేవలం ప్రచారం మాత్రమే ఓట్లు తీసుకురాదు కానీ... ఓట్లు తీసుకొచ్చె విషయంలో ప్రచారం కీలక భూమిక పోషిస్తుందని మాత్రం చెప్పొచ్చు!

ఈ క్రమంలో తాజాగా గూగుల్ యాడ్స్ ఖర్చులో ఏ పార్టీ ఏ ప్లేస్ లో ఉందనే విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా గూగుల్ ప్రకటనలకోసం ఖర్చు చేసే పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. 2023 రాష్ట్ర ఎన్నికల సమయంలో ఆ పార్టీ సుమారు రూ.19 కోట్లు కేటాయించింది. దీంతో ఈ విషయంలో టాప్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో గూగుల్ ప్రకటనల కోసం బీజేపీ ఈ స్థాయిలో భారీగా ఖర్చు చేసింది.

గూగుల్ ప్రకటనల పారదర్శక డేటా ప్రకారం 2023లో బీజేపీ రూ.19 కోట్లు ఖర్చు చేసిందని చూపిస్తుంది. దేశాన్ని పాలిస్తున్న పార్టీగా... వారు చేసిన పనులను, సాధించిన విజయాలను హైలెట్ చేస్తూ భారీ ఎత్తున ప్రకటలను ఇచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల ఖర్చును విపరీతంగా పెంచబోతుందని తెలుస్తుంది. వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గూగుల్ రూ. 17 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది అది భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

2023లో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కర్ణాటక రాష్ట్రంలో గూగుల్ ప్రకటనల కోస్సం రూ. 7.2 కోట్లు ఖర్చు చేయగా... మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తిస్ గఢ్ రాష్ట్రాల్లో గూగుల్ ప్రకటనల కోసం బీజేపీ రూ.7.71 కోట్లు ఖర్చు చేసింది. ఇదే క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆరెస్స్ పార్టీ రూ.12.1 కోట్లు ఖర్చు చేసి రెండోస్థానంలో నిలిచింది! ఇక కాంగ్రెస్ పార్టీ రూ.4.59 కోట్లు ఖర్చు చేయగా.. ఇందులో మొత్తం కర్ణాటక ఎన్నికల సమయంలోనే ఖర్చు చేసింది! మిగిలిన రాష్ట్రాల్లో అతితక్కువగా ఖర్చు చేసింది.

ఇక ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 3 వరకూ తెలంగాణలో రూ.2.6 కోట్ల ప్రకటనలు రాగా... అందులో బీజేపీ రూ.1.1 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... సీబీసీ రూ. 50 లక్షలు, ఐప్యాక్ రూ.60 లక్షలు, టీడీపీ రూ.13 లక్షలు ఖర్చు చేశాయి.

ఇక ఏపీ విషయానికొస్తే... ఇక్కడ 4.2 కోట్ల రూపాయల ప్రకటనలు రాగా వాటిలో ఐప్యాక్ రూ. 2.5 కోట్లు, బీజేపీ రూ.65 లక్షలు, సీబీసీ రూ.63 లక్షలు, టీడీపీ రూ.13 లక్షలు, వైసీపీ రూ.11 లక్షలు ఖర్చు చేశాయి. ఈ క్రమంలో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా బీజేపీ సుమారు రూ.30 కోట్లను ఈ ప్రకటనల కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.