Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌పై యుద్ధం స‌రే: బీజేపీ నేత‌లకు ఇది తెలుసా?

బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌, ఇత‌ర నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని తవ్వి తీశారు.

By:  Tupaki Desk   |   20 July 2024 1:30 PM GMT
జ‌గ‌న్‌పై యుద్ధం స‌రే: బీజేపీ నేత‌లకు ఇది తెలుసా?
X

కొన్ని కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల ఫ‌లి తాలు వ‌చ్చిన దాదాపు నెల రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను ప‌రామ ర్శించే ప‌నిని పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల అంశాల‌ను కూడా ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని.. హ‌త్య‌ల‌కు, దాడుల‌కు రాష్ట్రం కేంద్రంగా మారింద‌ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో నిజం ఉందా.. లేదా? ఆయ‌న అడిగితే.. రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టేస్తారా? అనేది ప‌క్క‌న పెడితే.. జ‌గ‌న్ డ్యూటీ జ‌గ‌న్ చేస్తున్నారు.. అని మాత్రం చెప్పుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఉన్న డ్యూటీ అదే క‌దా! ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కినా ద‌క్క‌క పోయినా.. మాజీ సీఎంగా ఆయ‌న స‌ర్కారు త‌ప్పులను ఎంచుతారు. ప్ర‌శ్నిస్తారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా గ‌ళం వినిపిస్తారు. అయితే.. జ‌గ‌న్‌పై ఒక్క‌సారిగా.. బీజేపీ నాయ‌కులు మూకుమ్మ‌డి దాడి చేయ‌డ‌మే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా ఉంది.

బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌, ఇత‌ర నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా గ‌తాన్ని తవ్వి తీశారు. ''జ‌గ‌న్ నువ్వు ఒక్క‌సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకో'' అంటూ పురందేశ్వ‌రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక‌, మంత్రి స‌త్య‌కుమార్ గ‌త సంగ‌తుల‌ను పూస గుచ్చిన‌ట్టుగా వివ‌రించారు. హ‌త్య‌లు, దుర్మార్గాలు, అక్ర‌మాలు జ‌రిగింది.. నీ హ‌యాంలోనే అంటూ.. స‌త్య‌కుమార్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. ద‌మ్ముంటే.. వాటిపై మాట్లాడాల‌ని అన్నారు.

అయితే. వీరు ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా.. రాష్ట్రంలో అప్ప‌టి(జ‌గ‌న్ హ‌యాం) ప‌రిస్థితులే కొన‌సాగుతు న్నాయ‌ని చెప్ప‌ద‌లుచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, వాస్త‌వం ఏంటంటే.. అప్ప‌ట్లో జ‌రిగిన వివాదాలు, ఘ‌ర్ష ణ‌లు వంటి వాటి కార‌ణంగా.. ప్ర‌జ‌లు సంచ‌ల‌న తీర్పు ఇచ్చార‌నే విష‌యాన్ని క‌మ‌ల నాథులు మ‌రిచిపో తున్నారు. జ‌గ‌న్ హ‌యాంలో ప‌రిస్థితి బాగోలేదు కాబ‌ట్టే.. ప్ర‌జ‌లు యూట‌ర్న్ తీసుకున్నారు. భారీ మెజారి టీతో కూట‌మిని గెలిపించారు. ఇక‌, ఇప్పుడు కూడా జ‌గ‌న్ మాదిరిగానే ప‌రిస్థితి ఉంటుంద‌ని చెప్ప‌ద‌లుచు కుంటే.. ఎలా? అనేది ప్ర‌శ్న‌.