Begin typing your search above and press return to search.

తెలంగాణాలో గెలుపు కోసం బీజేపీ మాస్టర్ స్కెచ్...?

తెలంగాణా ఎన్నికలు బీజేపీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఎందుకంటే డిసెంబర్ లో తెలంగాణా ఎన్నికలు

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:20 AM GMT
తెలంగాణాలో గెలుపు కోసం బీజేపీ మాస్టర్ స్కెచ్...?
X

తెలంగాణా ఎన్నికలు బీజేపీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఎందుకంటే డిసెంబర్ లో తెలంగాణా ఎన్నికలు జరిగితే ఆ మీదట 2024 ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. అంటే కచ్చితంగా నాలుగు నెలల సమయం కూడా ఉండకుండా లోక్ సభ ఎన్నికలు తరుముకు వస్తాయన్న మాట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా లేక గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి హోప్ అండ్ స్కోప్ ఉంటాయి.

కానీ అది కాస్తా తేడా కొడితే మాత్రం 2019లో వచ్చిన నాలుగు ఎంపీ సీట్లకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే బీజేపీ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల కోసం భారీ స్కెచ్ ని డిజైన్ చేసిందట. బడా నేతలు సీనియర్లు, ఎంపీలు, పార్టీ పెద్దలు ఇలా జనంలో పలుకుబడి ఉన్న వారిని అందరినీ తెచ్చి మరీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి బీజేపీ దింపబోతోందిట.

ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న నలుగురినీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయించడానికి హై కమాండ్ రెడీగా ఉందిట. అలా చూసుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి అంబర్ పేట అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే బండి సంజయ్ కరీం నగర్ లేదా వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారని అంటున్నారు.

ఇక ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. మరో ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూర్ లేదా కోరట్ల నుంచి పోటీ పడతారు. మాజీ ఎంపీ జితేంద్రరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డికి కూడా అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. అలాగే జితేంద్రరెడ్డి మహబూబ్ నగర్ లేదా షాద్ నగర్ నుంచి పోటీ పడతారని తెలుస్తోంది.

ఇక ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోధ్ లేదా అసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలో ఒక దాని నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లేదా హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి పోటీకి రెడీ చేసుకుంటున్నారట. ఎమ్మెల్యే రఘునందనరావు దుబ్బాక నుంచి పోటీకి మళ్లీ సిద్ధంగా ఉండమని అధినాయకత్వం చెప్పిందని అంటున్నారు.

అదే విధంగా డీకే అరుణను గద్వాల అసెంబ్లీ నుంచి పోటీ చేయించాలని ప్లాన్ లో కమలనాధులు ఉన్నారని అంటున్నారు. వీరితో పాటు సీనియర్ నేతలు ఇతర నాయకులు కూడా అసెంబ్లీ పోటీకి రెడీ కావాల్సిందే అని అధినాయకత్వం చెబుతోంది. వీరంతా బీజేపీకి గట్టి పట్టు ఉన్న అర్బన్ సెక్టార్ లతో పాటు హిందూత్వ భావన బలంగా ఉన్న చోట పోటీ చేస్తారు. తద్వారా బీజేపీకి మంచి నంబర్ లో విజయాలను నమోదు చేస్తారని అంటున్నారు. అలా ఎన్నికల్లో గణనీయంగా సీట్లను గెలుచుకునేందుకు మాస్టర్ ప్లాన్ బీజేపీ వేసిందని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో.