ఏలేటి కాటిపల్లి కమలంలో వింత లొల్లి !
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచాడు.
By: Tupaki Desk | 28 July 2024 4:30 PM GMTతెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మీద పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచాడు.
కాంగ్రెస్ పార్టీకే చెందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008 నుండి 2011 వరకు నిజామాబాద్ జడ్పీ చైర్మన్ పనిచేశాడు. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరాడు. 2018 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి ఓటమి పాలయ్యాడు. అయితే పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న ఏలేటి దీనికి సంబంధించి పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్ అన్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో శాసనసభ సమావేశాల సంధర్భంగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రూపాయి కేటాయించలేదు. ఎన్డీఏ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని సభలో తీర్మానం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపిన సమయంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాత్రం కామ్ గా ఉన్నారట.
కేంద్ర బడ్జెట్ మీద సభలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శాసనసభ్యులు అందరూ సభ నుండి వాకౌట్ చేశారు. అయితే బీజేపీ శాసనసభ్యులు అందరూ సభ నుండి వెళ్లిపోయినా కాటిపల్లి మాత్రం సభలోనే ఉండిపోయారట. అసలు ఎందుకు ఉండిపోయాడు ? అన్న చర్చ బీజేపీ శ్రేణులలో జరుగుతుంది. పార్టీ శాసనసభా పక్ష నేత ఒకలా, పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకలా వ్యవహరిస్తుండడంతో బీజేపీ శ్రేణులు తలలుపట్టుకుంటున్నాయి.