Begin typing your search above and press return to search.

బీజేపీ మంత్రి సత్యకుమార్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

అయితే బీజేపీకి ఒక్క మంత్రి పదవి దక్కగా... అనూహ్యంగా అందుకు సత్యకుమార్ ఎంపికవ్వడం గమనార్హం. దీంతో ఈయన గురించిన సెర్చ్ మొదలైందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 12:30 PM GMT
బీజేపీ మంత్రి సత్యకుమార్  బ్యాక్  గ్రౌండ్  తెలుసా?
X

అంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో టీడీపీ చెందిన వారు 20 మంది ఉండగా.. జనసేన నుంచి ముగ్గురికి ఛాన్స్ దక్కింది. అయితే బీజేపీకి ఒక్క మంత్రి పదవి దక్కగా... అనూహ్యంగా అందుకు సత్యకుమార్ ఎంపికవ్వడం గమనార్హం. దీంతో ఈయన గురించిన సెర్చ్ మొదలైందని అంటున్నారు.

అవును... ఏపీలో బీజేపీ నుంచి 8మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), సుజనా చౌదరి (విజయవాడ), విష్ణుకుమార్ రాజు (విశాఖ నార్త్), పార్థసారధి (ఆధోని), ఈశ్వర్ రావు (ఎచ్చర్ల), కామినేని శ్రీనివాసరావు (కైకలూరు), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి), సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం) నుంచి గెలిచారు.

అయితే అనూహ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై 3,734 ఓట్ల మెజారిటీతో గెలిచిన సత్యకుమార్ యాదవ్ ఒక్కరికీ మంత్రిపదవి దక్కింది. దీంతో... అతనిని అత్యంత అదృష్టవంతుడు అని కొంతమంది అంటుంటే... ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషే ఉందని, బలమైన బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందని అంటున్నారు. అదేమిటనేది ఇప్పుడు చూద్దాం...!

సత్యకుమార్ యాదవ్ కు ఢిల్లీలో బలమైన పరిచయాలే ఉన్నాయని అంటారు. బీజేపీ రాజకీయాల్లో సుపరిచితుడైన సత్యకుమార్... మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. ఆయన సమీప బందువునే సత్యకుమార్ వివాహం చేసుకున్నట్లు చెబుతారు. ఆ స్థాయిలో వెంకయ్య నాయుడితో సత్యకుమార్ అనుబంధం ఉంది.

ప్రధానంగా... విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకుడిగా ఉంటూ... తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు సంపాదించారు. వాజపేయి ప్రభుత్వంలోనూ, ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ పార్టీలో నమ్మకమైన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు సత్యకుమార్!

ఇదే సమయంలో ముఖ్యంగా మార్చి 2022లో ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 403 సీట్లకు గానూ 135 స్థానాల్లో సత్యకుమార్ సీట్ల బాధ్యతను నిర్వహించినట్లు చెబుతారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 252, మిత్రపక్షాలు 32 సీట్లు కలిపి ఎన్డీయే కూటమి మొత్తం 284 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో... సత్యకుమార్ కు పార్టీలో మరింత పేరు వచ్చిందని చెబుతుంటారు.

ఇలా బీజేపీలో అంచలంచెలుగా ఎదిగిన సత్యకుమార్... 2024 ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లా ధర్మవరం టిక్కెట్ దక్కించుకున్నారు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన తాజాగా ఎన్నికల్లో 3,734 ఓట్లతో సమీప ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించారు. ఈ క్రమంలో ఈ రోజు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా... ఈయన మహారాష్ట్ర నుంచి వలసవచ్చి హిందూపురంలో సెటిల్ అయ్యారు!