Begin typing your search above and press return to search.

బీజేపీలోకి వైసీపీ ఎంపీలు.. కన్ఫాం చేసిన కమలం నేత!

ఏపీ బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇదే సమయంలో చెల్లితో రాజీకి జగన్ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 12:41 PM GMT
బీజేపీలోకి వైసీపీ ఎంపీలు.. కన్ఫాం చేసిన కమలం నేత!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలోనూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... కేంద్రంలో బీజేపీకి సింగిల్ గా బలం లేని సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీడీపీ, బీజేడీలు ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. మరోపక్క త్వరలో ప్రభుత్వం కూలిపోద్దని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే పలువురు ఎన్డీయే పార్టీల ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని ఇటీవల రాహుల్ గాంధీ వెల్లడించారు. దీంతో... బీజేపీకి ఇతర పార్టీల మద్దతు చాలా అవసరం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఏపీ నుంచి టీడీపీకి 16 ఎంపీ స్థానాలు లోక్ సభలో ఉండగా... వైసీపీకి 11 స్థానాలు రాజ్యసభ లోనూ, 4 సీట్లు లోక్ సభలోనూ ఉన్న పరిస్థితి.

ఇటీవల ఈ విషయాలపై స్పందించిన విజయసాయిరెడ్డి... పార్లమెంట్ లో టీడీపీ కి వైసీపీకి ఉన్న బలంలో తేడా ఒక్క ఎంపీ మాత్రమేనని.. ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీకి రాజ్యసభలో తమ అవసరం కచ్చితంగా ఉంటుందని.. అంశాల వారీగా ప్రజాప్రయోజన విషయాలను పరిగణలోకి తీసుకుని తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఈ సమయంలో వైసీపీ ఎంపీలు బీజేపీలోకి రావాలని కోరుకుంటున్నారంటూ బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. మిథున్ రెడ్డి నాయకత్వంలో నలుగురు లోక్ సహ ఎంపీలూ బీజేపీలో చేరతారని చెప్పుకొచ్చారు ఏపీ బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇదే సమయంలో చెల్లితో రాజీకి జగన్ ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... బీజేపీ అంగీకరిస్తే అవినాష్ రెడ్ది మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. అయితే... బీజేపీ నాయకత్వం మాత్రం అక్కరలేదని అంటోందని చెప్పడం గమనార్హం! అయినప్పటికీ మేము చేరతామంటూ మిథున్ రెడ్డి ఇంకా లాబీయింగ్ చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరాలని మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణ రెడ్డి. ఇదే సమయంలో... తన చెల్లితో రాజీ చేయాలని జగన్ తన తల్లిని కోరాడని తెలిపారు ఆదినారాయణ రెడ్డి. అయితే... అందుకు షర్మిళ అంగీకరించడం లేదని, అన్ననే వచ్చి కాంగ్రెస్ లో చేరమని చెప్పిందని చెప్పుకొచ్చారు.

ఇక వివేకా హత్య కేసుపైనా బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... త్వరలోనే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని.. అనంతరం జరిగే కడప లోక్ సభ ఉప ఎన్నికల్లో భూపేష్ రెడ్డి టీడీపీ తరుపున పోటీ చేసి గెలుస్తారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.