Begin typing your search above and press return to search.

రాజాసింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌... ఇంటా బయటా అంటూ బాంబు!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ బిల్లు వ్యవహారం కూడా రసవత్తరంగా మారింది.

By:  Tupaki Desk   |   6 Aug 2023 6:31 AM GMT
రాజాసింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌... ఇంటా బయటా అంటూ బాంబు!
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ బిల్లు వ్యవహారం కూడా రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలు, ముంపు, ఇతర ప్రజా సమస్యలపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... రసవత్తరంగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ నేతలపై కూడా పరోక్షంగా కామెంట్లు చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం, ఎమ్మెల్యే అవ్వడం వంటి విషయాలపై ఆయన స్పందించారు.

ఇందులో భాగంగా... వచ్చే అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్‌ చెప్పారు. రానున్న ఎన్నికల తర్వాత ఏర్పడే అసెంబ్లీకి తాను రాకపోవచ్చని అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. అంటే ఎన్నికల్లో పోటీ చేయరా.. లేక, పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నార అన్నది మాత్రం స్పష్టం కాలేదు అని అంటున్నారు.

ఇదే సమయంలో... ఇంటా బయటా తనను అసెంబ్లీకి రావొద్దనే కోరుకుంటున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు బీజేపీలోనూ, బయటా కూడా చర్చనీయాంశమయ్యాయని తెలుస్తోంది. తనకు బీజేపీలోనే శత్రువులు ఉన్నారని రాజాసింగ్ పరోక్షంగా చెప్పినట్లు భావించొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.

అనంతరం... ధూల్ పేట్ లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని.. అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారని రాజాసింగ్ తెలిపారు. ఇదే సమయంలో అసెంబ్లీలో తానున్నా లేకున్నా.. ధూల్ పేట్ ని అభివృద్ధి చేయాలని స్పీకర్ ని రాజాసింగ్ కోరడం గమనార్హం.

కాగా... మ‌హ్మద్ ప్రవ‌క్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో బీజేఎల్పీ నేత రాజాసింగ్‌ పై గతేడాది ఆగస్టు 23న ఆ పార్టీ స‌స్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చ‌ర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ పెద్దలు తెలిపారు. అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు.

రాజాసింగ్.. గోషామహల్ నియోజకవర్గం నుంచి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ పై 46వేలకు పైగా మెజారిటీతో సాధించిన ఆయన... 2018 ఎన్నికల్లో బీఆరెస్స్ అభ్యర్థి ప్రేం సింగ్ రాథోర్ పై 17వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు.