మైక్రో ఇన్ ఫ్లూయెన్సర్లతో బీజేపీ సరికొత్త స్ట్రాటజీ!
ఇందులో భాగంగా మైక్రో ఇన్ ఫ్లూయెన్సర్లతో ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకొంది.
By: Tupaki Desk | 25 March 2024 11:30 PM GMTగతకొంతకాలంగా ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా పాత్ర ఏ స్థాయిలో ఉంటుందనేది తెలిసిన విషయమే. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో న్యూస్ మీడియా పాత్రకంటే.. సోషల్ మీడియా పాత్ర అత్యధికం అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఇక ఈ సోషల్ మీడియాని వినియోగించుకొని ఎన్నికల ప్రచారం చేయడంలో భారతీయ జనతాపార్టీ ఎంత ముందుంటుందనే విషయం 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తెలిసిన పరిస్థితి!
ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... ఈసారి ఢిల్లీ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ ఒక సరికొత్త వ్యూహానికి తెరతీసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మైక్రో ఇన్ ఫ్లూయెన్సర్లతో ప్రచారానికి వాడుకోవాలని నిర్ణయించుకొంది. "దిల్ మే మోడీ.. ఢిల్లీ మే మోడీ" పేరిట జరుగుతున్న ఈ సరికొత్త ప్రచార కార్యక్రమానికి వారే సరైన ప్రచారకర్తలు అని బీజేపీ భావిస్తుందని తెలుస్తోంది. అందుకు బీజేపీ భావిస్తోన్న కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
భారీ ఎత్తున ఫాలోయింగ్ ఉన్నవారితో పోలిస్తే.. చిన్న చిన్న ఇన్ ఫ్లూయెన్సర్ల మాటను సమాజంలో ఎక్కువగా నమ్ముతారని బీజేపీ భావిస్తోందంట. ఇదే సమయంలో వీరికి క్షేత్రస్థాయ్యిలోని ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉంటాయని బలంగా భావిస్తోందంట. పైగా... వీరి ఫాలోవర్ల సంఖ్య కూడా 2000 నుంచి 5000 మధ్యలోనే ఉంటుందని ఢిల్లీ బీజేపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ రోహిత్ ఉపాధ్యాయ తెలిపారు.
వీరికి క్షేత్రస్థాయిలో ఓటర్లతో నేరుగా సంబంధాలు ఉంటాయని పార్టీ బలంగా నమ్ముతోంది. భారీ ఫాలోయింగ్ ఉన్నవారితో పోలిస్తే.. చిన్న ఇన్ ఫ్లూయెన్సర్ల మాటను సమాజంలో ఎక్కువ నమ్ముతారని భావిస్తోంది. వీరి ఫాలోవర్ల సంఖ్య కూడా కేవలం 2,000 నుంచి 5,000 మధ్యలోనే ఉంటుందని దిల్లీ బీజేపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జి రోహిత్ ఉపాధ్యాయ తెలిపారు. తాజాగా ఈ విషయాలపై ఆయన స్పందించారు.
ఇందులో భాగంగా... పార్టీ ఏదైనా మంచి చేస్తే ఆ మంచిని చాలామంది ఇన్ ఫ్లూయెన్సర్లు సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా ఆ విషయాన్ని ప్రచారం చేశారని తెలిపిన ఆయన.. తాము వారిని సంప్రదించడం వంటివి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి మాత్రం పార్టీలో పనిచేసే వారిపై పూర్తి బాధ్యతలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఏ వర్గం ఎటువంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లను వాడుతున్నారో తెలుసుకొని వారిని చేరుకొంటున్నామని తెలిపిన ఆయన... వయసులో పెద్దవారు, వెనుకబడిన వారు ఫేస్ బుక్ వాడుతుండగా.. యువత, విద్యావంతులు ఇన్ స్టాగ్రాం, ఎక్స్ (ట్విట్టర్) అధికంగా వాడుతున్నరు అని తెలుసుకు.. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా మాధ్యమాలకు తగిన కంటెంట్ ను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇలా ఢిల్లీలో బీజేపీ సోషల్ మీడియా ప్రచారాన్ని సరికొత్తగా ప్రారంభించనుంది!!