Begin typing your search above and press return to search.

ఉమ్మడి అభ్యర్థి సాధ్యమేనా ?

అందుకనే ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపితే బీజేపీ గెలుపును అడ్డుకోవచ్చన్న దిశలో ప్రతిపక్షాలు అజెండాను వర్కవుట్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 July 2023 5:47 AM GMT
ఉమ్మడి అభ్యర్థి సాధ్యమేనా ?
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలన్నది యూపీఏ, నాన్ ఎన్డీయే పార్టీల ముఖ్య అజెండా. అయితే అది సులభమేనా ? అనుకున్నంత తేలికగా జరుగుతుందా ? మాట్లాడుకున్నంత, కాగితాలపై లెక్కలు వేసుకున్నంత తేలికకాదు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తేవాలన్న లక్ష్యం మంచిదే. అయితే అది చాలా కష్టమన్న విషయాన్ని అన్నీ ప్రతిపక్షాలకు ఈపాటికే అర్ధమైపోయింది. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలంటే, అన్నీ పార్టీలు సిన్సియర్ గా ఉండాలంటే ముందు త్యాగాలకు సిద్ధమవ్వాలి.

త్యాగాలకు సిద్ధమవ్వటంతో పాటు ఇగోలను వదిలేయాలి. మేము గొప్పంటే కాదు మేమే గొప్పనే ఆలోచనలను పక్కనపెట్టేయాలి. అప్పుడే ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావటం సాధ్యమవుతుంది. ఇలాంటి అనేక అంశాలకు 18వ తేదీన జరగబోయే బెంగుళూరు సమావేశమే వేదిక కాబోతోంది.

పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో అయినా బెంగుళూరులో జరగబోతున్న సమావేశంలో అయినా ఉమ్మడి అభ్యర్ధిని పోటీలోకి దింపటమే కీలకమైన అజెండాగా మారబోతోంది.

2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 37 శాతంమే అయినా గెలుచుకున్న సీట్లు 303. అంటే 63 శాతం మంది జనాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అర్ధమవుతోంది. 60 శాతంమంది జనాలు వ్యతిరేకంగా ఓట్లువేసినా మరి బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చింది ? ఎలాగంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక కారణంగానే అన్నది స్పష్టమవుతోంది. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోయిన కారణంగానే తక్కువ ఓట్లొచ్చినా బీజేపీ గెలిచిందన్నది స్పష్టమైంది. అందుకనే ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని రంగంలోకి దింపితే బీజేపీ గెలుపును అడ్డుకోవచ్చన్న దిశలో ప్రతిపక్షాలు అజెండాను వర్కవుట్ చేస్తున్నాయి.

ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక ఉమ్మడి అభ్యర్ధిని పోటీలోకి దింపితే బీజేపీ అభ్యర్ధిని ఓడించటం కష్టంకాదని నిర్ణయానికి వచ్చాయి. అందుకనే ఉమ్మడి అభ్యర్ధి పద్దతిలో కనీసం 450 సీట్లను గెలుచుకోవచ్చని ప్లాన్ వేస్తున్నాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయపార్టీలు పోటీ నుండి తప్పుకోవటానికి ఇష్టపడవు.

ప్రతి పార్టీ తానే పోటీచేయాలని అనుకుంటుంది.ఒకవేళ పోటీనుండి తప్పుకోవాల్సొస్తే వెంటనే రెబల్ అభ్యర్ధిగా నామినేషన్ వేయిస్తుంది. అది కుదరకపోతే సదరు అభ్యర్ధి రాజీనామా చేసి బీజేపీలోకి మారిపోయే అవకాశముంది. ఇలాంటి సున్నితమైన, కీలకమైన అంశాలపై బెంగుళూరు సమావేశం చర్చించబోతోంది. మరి ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.