కమలనాదులు హోరెత్తించబోతున్నారా ?
ఇందులో భాగంగా 25,26,27 తేదీల్లో వరసుగా నరేంద్ర మోడీ ప్రచారం చేయబోతున్నారు. మూడు రోజులు ఏకథాటిగా తెలంగాణాలో మోడీ ప్రచారమంటే మామూలు విషయం కాదు.
By: Tupaki Desk | 14 Nov 2023 4:30 PM GMTఈనెల 24వ తేదీ నుంచి బీజేపీ అగ్రనేతలు తెలంగాణాలో ప్రచారంతో మోగ మోగించేయబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లోని ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, మిజోరంలో 23వ తేదీకి ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఇదే సమయంలో తెలంగాణాలో మాత్రం ప్రచారం 28వ తేదీన ముగుస్తుంది. ఎందుకంటే పోలింగ్ 30వ తేదీ కాబట్టి. అందుకనే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో 23వ తేదీ ఎన్నికలు అయిపోగానే వెంటనే అందరు తెలంగాణాలో అడుగుపెట్టబోతున్నారు.
ఇందులో భాగంగా 25,26,27 తేదీల్లో వరసుగా నరేంద్ర మోడీ ప్రచారం చేయబోతున్నారు. మూడు రోజులు ఏకథాటిగా తెలంగాణాలో మోడీ ప్రచారమంటే మామూలు విషయం కాదు. వరుసగా మూడు రోజులు బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు తెలంగాణాలోనే ఉండబోతున్నాయంటే మోడీ ఇక్కడే మకాం వేయబోతున్నారని అర్ధం. మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు తెలంగాణాను తమ పర్యటనలు, ప్రచారాలతో హోరెత్తించేబోతున్నారు.
జిల్లాకు ముగ్గురు, నలుగురు ప్రముఖులను పార్టీ ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. పార్టీ రెడీచేసిన షెడ్యూల్ ప్రకారం కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు ప్రచారంలో బీజీగా ఉండబోతున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణా జనాలపైన కమలనాదులు దండయాత్ర చేస్తున్నారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యనే జరిగిన కర్నాటక ఎన్నికల్లో కూడా మోడీ, అమిత్ షా, నడ్డా, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాగే ప్రచారం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రచారం చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటితో అధికారంలోకి వచ్చింది.
నిజానికి తెలంగాణాలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే భ్రమల్లో ఎవరూ లేరు. ఈ విషయం తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండ్ కో కి బాగా తెలుసు. అయినా ఎన్నికల్లో గెలిచేది తామే అని పదేపదే చెప్పుకుంటున్నారు. తప్పదు కాబట్టి అలాగే చెప్పుకుంటున్నారు. ఇందులో కమలనాదుల తప్పు కూడా ఏమీలేదు. ఎన్నికల్లో ఫలితాలు వచ్చేంతవరకు గెలవబోయేది తామే అనే రాజకీయ పార్టీలు చెప్పుకోవటం అందరు చూస్తున్నదే. మరి వీళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీవరకు వెయిట్ చేయాల్సిందే.