Begin typing your search above and press return to search.

ఒక్క పోస్టుతో టీడీపీకి బీజేపీ రెడ్ సిగ్నల్...!?

గుర్తులు వేరు అయినా గురి ఒక్కటే అంటూ బీజేపీ ఏపీ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోస్ట్ తో తాము సైకిల్ పార్టీకి దూరం అని చెప్పేసినట్లు అయింది.

By:  Tupaki Desk   |   20 Dec 2023 3:44 AM GMT
ఒక్క పోస్టుతో టీడీపీకి బీజేపీ రెడ్ సిగ్నల్...!?
X

బీజేపీకి తెలుగుదేశం పార్టీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో ఒక్క మీమ్ తో చెప్పేసింది. అంతే కాదు అందరూ ఆ తానులో ముక్కల అంటూ కాంగ్రెస్ వైసీపీని కూడా కలిపేసింది. గుర్తులు వేరు అయినా గురి ఒక్కటే అంటూ బీజేపీ ఏపీ ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోస్ట్ తో తాము సైకిల్ పార్టీకి దూరం అని చెప్పేసినట్లు అయింది.

ఎందుకంటే వైసీపీ బీజేపీ ఎపుడూ బాహాటంగా పొత్తులలో లేవు. అలాగే కాంగ్రెస్ బీజేపీకి జాతీయ స్థాయిలో శత్రువు. ఇక చూస్తే ఈ పోస్టర్ ని గురి చూసి పెట్టింది ఎవరినీ అంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీన అని అంటున్నారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా టీడీపీ మద్దతు ప్రకటించింది అన్న ప్రచారం నేపధ్యంలో బీజేపీ పోస్టు ని చూస్తే మొత్తం అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.

ఇంతకీ బీజేపీ పెట్టిన పోస్టింగ్ ఎలా ఉంది అంటే బీజేపీ ఏపీ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల కార్టూన్‌ను సామూహిక మీమ్ లో షేర్ చేసింది. వారు మీమ్‌కి క్యాప్షన్ ఇచ్చారు ఈ మూడు పార్టీలు ఒకేలా ఉంటాయి. ఒకే గొడుగు కిందనే ఉంటాయి. కానీ విడివిడిగా పోట్లాడుకునేలా ప్రజలను మోసగిస్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కానీ అది ఇపుడు విఫలమవుతోంది అని రాసుకొచ్చింది.

అంటే కాంగ్రెస్ తో అంటకాగుతున్న పార్టీలుగా వైసీపీని టీడీపీని బీజేపీ చూస్తోంది అన్న మాట. దాని వల్ల వైసీపీకి ఏమీ పోయేది లేదు కానీ టీడీపీ పొత్తుల కోసం ఎదురుచూస్తున్న పార్టీగా ఉంది. దాంతో తన మనసులో భావన అలా బీజేపీ చెప్పేసిందా అని అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఓ వైపు ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం ఖాయమైన వైసీపీ మరోవైపు టీడీపీ, జనసేన పొత్తుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

ఇక బీజేపీ ఒంటరిగా పోటీ చేయగల పరిస్థితిలో లేదు. కానీ మిత్రపక్షం జనసేనతో కలసి ఒక కూటమిగా వెళ్లాలని చూసింది. కానీ పవన్ టీడీపీతో పొత్తులో ఉన్నారు. మరి బీజేపీ టీడీపీని దూరం అంటోంది. మరి ఇది ఎలా అన్నదే చూడాలి చివరి నిముషంలో అయినా పొత్తు పెట్టుకుంటారనుకుంటే టీడీపీని టార్గెట్ చేస్తోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో జనసేనతో కలసి బీజేపీ సొంతంగా వెళ్లే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.