గుజరాత్ లో బీజేపీ బలం తగ్గుతుందా?
బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికలు గుజరాత్ వే.
By: Tupaki Desk | 8 May 2024 12:30 AM GMTబీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఎన్నికలు గుజరాత్ వే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ జరిగే ఎన్నికలకు ప్రత్యేకత ఉండటం సహజమే. ఈ నేపథ్యంలో మూడో విడతలో భాగంగా గుజరాత్ లోని 25 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ మొత్తం క్లీన్ స్వీప్ చేయడంతో ఈ సారి కూడా అదే జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.
గత ఎన్నికల కంటే ఈ సారి భిన్నంగా ఉంటుందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముందున్న పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదని అంటున్నారు. అక్కడక్కడ పోటీ తీవ్రంగా నెలకొందంటున్నారు. మునుపటి పరిస్థితి ఇప్పుడు ఉండదని తెలుస్తోంది. ఏడు నియోజకవర్గాల్లో కాషాయ పార్టీకి పోటీ నెలకొందని చెబుతున్నారు. పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాల కారణంగా పార్టీ నష్టపోయే అవకాశాలున్నాయని అంటున్నారు.
దేశమంతా మోదీ ప్రభంజనం వీస్తున్నా ఇక్కడ కొంత వ్యతిరేకత ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయమే అని తెలుస్తోంది. కానీ కొన్ని చోట్ల మాత్రం ఫలితాలు కొంత తారుమారు అవుతాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విజయం కోసం తాపత్రయ పడుతున్నా అంతిమ విజయం బీజేపీదే అంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు జరిగే ఎన్నికలు రెండు పార్టీలకు చాలో రేవో అన్నట్లు నిలుస్తున్నాయి. బీజేపీని నిలువరించాలని కాంగ్రెస్, మూడోసారి అధికారం చేపట్టాలని బీజేపీ రెండు బలమైన కోరికలతోనే ఉన్నాయి. దీంతో రెండు పార్టీలు విజయం కోసం తపించిపోతున్నాయి. కానీ ఓటర్లు మాత్రం బీజేపీకే మొగ్గు చూపుతున్నారనే విషయం తెలిసిపోతోంది.
బీజేపీ ఖాతాలో మరో విజయం దక్కనుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో ఉత్తరాదిన బీజేపీకి ఎదురే లేకుండా పోయింది. కాస్త దక్షిణాదినే బలం లేకుండా పోయింది. అయినా విజయం బీజేపీదే అంటున్నారు.