Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల‌కు నిరాశేనా? బీజేపీ టాక్‌!

ఇక‌, ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు మ‌హిళా నాయ‌కులు.. కేంద్రంలోని మంత్రి ప‌ద‌వుల‌పై చాలానే ఆశలు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 8:46 AM GMT
ఆ ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల‌కు నిరాశేనా?  బీజేపీ టాక్‌!
X

కేంద్రంలో కొలువు దీరుతున్న బీజేపీ స‌ర్కారులో మంత్రి ప‌ద‌వుల వ్య‌వ‌హారం దాదాపు కొలిక్కి వ‌చ్చింది. ఈసారి ఉత్త‌రాది వారితో పాటు.. ద‌క్షిణాదికి కూడా .. మోడీ ప్రాధాన్యం ఇచ్చారు. గ‌తంలో మూడు ప‌ద‌వులు ఇచ్చి స‌రిపుచ్చిన ఆయన ఈసారి రెండు తెలుగురాష్ట్రాల‌కు.. 5 మంత్రిప‌ద‌వులు ఇచ్చారు. ఏపీకి మూడు, తెలంగాణ‌కు రెండు ప‌ద‌వులు ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ‌ర్మ్ అయ్యాయి. వీరిలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు ఇద్ద‌రు, బీజేపీ ఎంపీ ఒక‌రు ఉన్నారు.

గుంటూరు ఎంపీపెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌లు టీడీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీ భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ బీజేపీ నుంచి ఎంపిక‌య్యారు. వీరికి ఇప్ప‌టికే స‌మాచారం అందింది. ఇక‌, తెలంగాణ‌లో అంద‌రూ ఊహించిన వారిలో ఒక్క ఈట‌ల రాజేంద‌ర్ మిన‌హా.. మాజీ మంత్రి కిషన్ రెడ్డికి మ‌రోసారి మోడీ చాన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా బీజేపీని ప‌రుగులు పెట్టించిన బండి సంజ‌య్‌కు కూడా.. చాన్స్ ఇచ్చారు. ఈట‌ల త‌ర్వాత ద‌శ‌లో ఉండే అవ‌కాశం కూడాక‌నిపించ‌డం లేదు.

ఇక‌, ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు మ‌హిళా నాయ‌కులు.. కేంద్రంలోని మంత్రి ప‌ద‌వుల‌పై చాలానే ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి, తెలంగాణ నుంచి జేజెమ్మ‌గా పేరొందిన‌.. డీకే అరుణ‌. వీరిద్ద‌రూ కూడా.. ఖాయంగా మంత్రి వ‌ర్గంలో ఉంటార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఇప్పుడు వీరికి అవ‌కాశం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం వెలువ‌రించిన‌.. జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో మ‌హిళా నాయ‌కుల‌కు చాన్స్ ద‌క్క‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మున్ముందు ఏమైనా అవ‌కాశం ఇస్తారేమో చూడాలి.