షాకింగ్ విజువల్స్... టాటా "పంచ్" ను ఢీకొని నుజ్జు నుజ్జైన బీఎండబ్ల్యూ!
దేశ రాజధాని ఢిల్లీ గేట్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు - టాటా పంచ్ ను ఢీకొని రోడ్డుపైకి దూసుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది!
By: Tupaki Desk | 6 Dec 2024 5:46 AM GMTదేశ రాజధాని ఢిల్లీ గేట్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు - టాటా పంచ్ ను ఢీకొని రోడ్డుపైకి దూసుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది! ఈ సందర్భంగా లగ్జరీ కారు బీఎండబ్ల్యూ జెడ్-4 కన్వర్టబుల్.. ఢీకొన్న ప్రదేశం నుంచి సుమారు 100 మీటర్లు దూసుకువెళ్లిపోయిందని అంటున్నారు. అందులోని డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి!
అవును... ఢిల్లీ గేట్ ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారు టాటా పంచ్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న ఇతరులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ బీఎండబ్ల్యూ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. 20 ఏళ్ల సుఖ్విందర్ సింగ్ బీఎండబ్ల్యూ డ్రైవ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ కేసులో అతివేగం లేదా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారా అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. సంఘటన జరిగిన సమయంలో సింగ్ మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది నిర్ధారించడానికి అతనికి వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు.
దీనిపై ఐపీ ఎస్టేట్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది. ఇక, టాటా పంచ్ కారును రాహుల్ అనే వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా.. అది ఐటీఓ నుంచి ఢిల్లీ గేట్ వైపు ప్రయాణిస్తుందని.. అందులో అతనితో సహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ హైస్పీడ్ తో వచ్చి తమ వాహనాన్ని పక్కనుంచి ఢీకొట్టినట్లు తెలిపారు.
అయితే... ఈ ప్రమాదంలో టాటా పంచ్ కారు స్వల్పంగా డ్యామేజ్ అవ్వగా.. బీఎండబ్ల్యూ కారు బాగా దెబ్బతినడం గమనార్హం! దీనిపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో టాటా క్వాలిటీ గురించి ప్రశంసిస్తున్న నెటిజన్లు.. కారు ఏ కంపెనీది అనేది ముఖ్యం కాదు.. క్రాష్ రేటింగ్ ముఖ్యమని అంటూ స్పందిస్తున్నారు!