Begin typing your search above and press return to search.

బోయింగ్ నేరంగీకారం... $243.6 మిలియన్లు జరిమానా!?

2018, 2019 సంవత్సరాల్లో సుమారు ఐదు నెలల వ్యవధిలో రెండు ఘోర విమాన ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 12:30 PM GMT
బోయింగ్  నేరంగీకారం... $243.6 మిలియన్లు జరిమానా!?
X

2018, 2019 సంవత్సరాల్లో సుమారు ఐదు నెలల వ్యవధిలో రెండు ఘోర విమాన ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండోనేషియా, ఇథియోపియాలో రెండు 737 మ్యాక్స్ విమానాలు ఘోర ప్రమదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో సుమారు 346 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజాగా బోయింగ్ సంస్థ నేరాన్ని అంగీకరించింది. అమెరికా జస్టిస్ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది.

అవును... ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్... అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు 737 మ్యాక్స్ విమానాలు రెండు ఘోర ప్రమాదాలకు గురైన కేసులో నేరపూరిత మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఇదే క్రమంలో... ఆయా విమానాల సర్టిఫికేషన్స్ విషయంలో అమెరికా నియంత్రణ సంస్థలను మోసం చేసినట్లు ఒప్పుకొంది.

అయితే ఈ తాజా ఒప్పందం ఆ రెండు ఘటనల నుంచి మాత్రమే బోయింగ్ కు రక్షణ కల్పిస్తుంది. అంతేకానీ... ఈ ఏడాది అలస్కాలో చోటుచేసుకున్న ప్రమాదాల నుంచి మాత్రం ఎలాంటి రక్షణ ఉందదని జస్టిస్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అయితే జస్టిస్ డిపార్ట్ మెంట్ తో బోయింగ్ ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆ రెండు ప్రమాదాల్లోనూ మరణించిన వారి కుటుంబ సభ్యులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

ఇదే సమయంలో... భద్రతను పూర్తిగా గాలికి వదిలేసి, కేవలం లాభాల కోసం బోయింగ్ ఎలాంటి వ్యాపార పద్దతులను అవలంభించిందీ నిరూపించేందుకు ఇప్పటికే పలు సాక్ష్యాధారాలను తాము అందించామని.. అయినప్పటికీ ఈ ఒప్పందం చేసుకోవడం సరైన చర్య కాదని.. ఈ ఒప్పందం కేవలం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని వారి తరుపు లాయర్ పేర్కొన్నారు.

కాగా... ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగిన రెండు ఘోర విమాన ప్రమాదాల్లో బోయింగ్ పై ప్రాసిక్యూషన్ కు బాధిత కుటుంబ సభ్యులు నాడు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోనే బోయింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం... 243.6 మిలియన్ డాలర్లు ఆ సంస్థ జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో... 455 మిలియన్ డాలర్లు విమనాల్లో భద్రత మెరుగుకు బోయింగ్ వెచ్చించాల్సి ఉంటుంది.