నన్ను చంపేందుకు కుట్ర: వైసీపీ ఎమ్మెల్యే బొల్లా
తనను అంతం చేయాలన్న ఉద్దేశ్యంతోనే దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 28 July 2023 3:08 PM GMTపల్నాడు జిల్లా వినుకొండ లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర స్థాయి లో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారు పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వినుకొండలో శాంతి భద్రతల రీత్యా 144 సెక్షన్ విధించారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కావడం తో పట్టణం లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారం పై బ్రహ్మనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను అంతం చేయాలన్న ఉద్దేశ్యంతోనే దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆ రకంగా తనను అడ్డు తొలగించుకొని ఎన్నికల్లో గెలవాల ని టీడీపీ భావిస్తోందని ఆరోపించారు. దాదాపు 400 మంది తన పై దాడి లో పాల్గొన్నారని, తనను అడ్డు తొలగించుకొని వినుకొండలో సులువు గెలవాలన్నదే టీడీపీ ఆలోచన అని ఆరోపణలు గుప్పించారు. టీడీపీ శ్రేణుల దాడి లో తన గన్ మెన్ కు గాయాలయ్యాయ ని అన్నారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారం పై వినుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు స్పందించారు. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ శ్రేణుల పై వైసీపీ శ్రేణులు దాడులు చేశాయని, తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. పల్నాడులో జరగబోయే యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులే కర్రలు ఇచ్చి దాడుల కు సహకరించారని, అనవసరంగా సీఐ ఫైర్ చేశారని, ఆయనను సస్పెండ్ చేయాల ని డిమాండ్ చేశారు.
మాచర్ల నుంచి వచ్చిన వైసీపీ నేతలు వినుకొండలో గొడవ చేశారని, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు నిజ స్వరూపం నిన్న బయటపడిందని, ఇక పై ఆయన ను గుడ్డలూడదీసి రోడ్డు పై నిలబెడతామని హెచ్చరించారు.