ముస్లిం పర్సనల్ లా ప్రకారం 'నాలుగు' పెళ్లిళ్లు చేసుకోవచ్చన్న బాంబే హైకోర్టు
ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక ముస్లిం పురుషుడు పెట్టుకున్న అభ్యర్థన నేపథ్యంలోచోటు చేసుకున్న సందేహానికి తాజాగా ముంబై హైకోర్టు క్లారిటీ తీర్పును ఇచ్చింది.
By: Tupaki Desk | 23 Oct 2024 4:58 AM GMTముస్లిం పురుషుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు? అన్న సందేహానికి స్పష్టమైన తీర్పును ఇచ్చింది బాంబే హైకోర్టు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ మతానికి చెందిన పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక కేసులో ఈ విషయాన్ని వెల్లడించింది. ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక ముస్లిం పురుషుడు పెట్టుకున్న అభ్యర్థన నేపథ్యంలోచోటు చేసుకున్న సందేహానికి తాజాగా ముంబై హైకోర్టు క్లారిటీ తీర్పును ఇచ్చింది.
తాను అల్జీరియాకు చెందిన మహిళను మూడో భార్యగా స్వీకరిస్తున్నానని.. తమ వివాహాన్ని రిజిస్టర్ చేసి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఒక ముస్లిం పురుషుడు ఠాణేలోని వివాహ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు గత ఫిబ్రవరిలో అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే.. మహారాష్ట్ర వివాహాల చట్టం ప్రకారం ఒక్క పెళ్లిని మాత్రమే గుర్తిస్తుందని.. ఇది మూడో పెళ్లి కావటంతో తాము నమోదు చేయలేమని అధికారులు స్పష్టం చేశారు.
దీనిపై సదరు ముస్లిం దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జరిగిన వాదనలు విన్న బాంబే హైకోర్టు.. ముస్లిం పురుషులు నలుగురు భార్యలను కలిగి ఉండొచ్చని.. ముస్లిం పర్సనల్ లా దీనికి అనుమతిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.
దంపతుల నుంచి కావాల్సిన పత్నాలన్నీ తీసుకొని.. వారి పెళ్లిని అనుమతిస్తున్నట్లు కానీ.. రిజెక్టు చేస్తున్నట్లు కానీ పది రోజుల్లో తెలపాలని పేర్కొనటమే కాదు..తమ నిర్ణయానికి కారణాల్ని కూడా వివరించాలని హైకోర్టు ఆదేశించింది. బాంబే కోర్టు తాజా తీర్పుతో.. దేశంలో కామన్ సివిల్ కోడ్ మీద మరోసారి చర్చ షురూ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.