Begin typing your search above and press return to search.

కోర్టులో కేసు, బయట సెటిల్మెంటు... హైకోర్టు సీరియస్!

ఇలాంటి పనుల వల్ల పోలీసులు, కోర్టు సమయం వృథా అవుతుందని తెలిపింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 4:15 AM GMT
కోర్టులో కేసు, బయట సెటిల్మెంటు...  హైకోర్టు సీరియస్!
X

తొలుత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఆనాక కోర్టులో వాదనలు జరగడం.. తీరా కొంతకాలం అయ్యాక బాధితులు, నిందితులు కోర్టు బయట తమ సమస్యలు పరిష్కరించేసుకోవడం.. వంటి వాటికి పాల్పడే వారిపై తాజాగా హైకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఇలాంటి పనుల వల్ల పోలీసులు, కోర్టు సమయం వృథా అవుతుందని తెలిపింది.

అవును... కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు వెలుపల నిందితులు, బాధితులు ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి సెటిల్ చేసుకోవడం అనే అంశంపై తాజాగా బాంబే హైకోర్టు సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. "విచారణ అధికారి, కోర్టు సమయాన్ని వృధా చేసే అలాంటి వ్యక్తులపై భారీ మూల్యం విధించేలా బలమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని వ్యాఖ్యానించింది.

వివరాళ్లోకి వెళ్తే... థానే జిల్లాలోని మీరా భయందర్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారానికి సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. నమోదు అయ్యింది. ఈ సమయంలో న్యాయవాది జోతిరాం యాదవ్ దాఖలుచేసిన పిటిషన్ లో తమ క్లైంట్ కు బధితులకు సంబంధం ఉందని.. కొన్ని అపార్థాల వల్ల ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడిందని పేర్కొన్నారు.

ఈ సమయంలో బాధితురాలు కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆమె తరుపున న్యాయవాది మమతా హస్రజని సమర్పించారు. నిందితుడు, బాధితురాలు తమ విభేదాలను పరిష్కరించేసుకున్నారని తెలిపారు. అయితే.. పోలీసుల తరుపున హాజరైన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన్వీర్ ఖాన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది అత్యాచార కేసు అని, ఇది తీవ్రమైన నేరమని, నిందితుడు బాధితురాలి ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని.. ఫలితంగా పలు అశ్లీల సందేశాలు వచ్చాయని.. ఈ బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకించాలని.. నిందితులు, బాధితులు తమ విభేదాలను పరిష్కరించుకున్నప్పటికీ అలాంటి చర్యలను క్షమించరాదని న్యాయస్థానాన్ని కోరారు.

దీంతో... నిందితుడిపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని, ఆ వ్యక్తి బెయిల్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడానికి కోర్టు మొదట ఇష్టపడలేదు. అయితే... బాధితురాలి అఫిడవిట్ ను కూడా పరిగణలోకి తీసుకుని, కొన్ని షరతులు విధిస్తూ జస్టిస్ పీతలే బెయిల్ మంజూరు చేశారు. ఈ సమయంలోనే జస్టిస్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... బాధితులు, నిందితులు ఒక చోట చేరి, వారి విభేదాలను పరిష్కరించుకున్నారు.. ఆపై బాధితుడు బెయిల్ మంజూరు చేయడానికి అటువంటి చర్యలను రద్దు చేయడానికి కూడా సమ్మతి ఇస్తారు. దీనివల్ల కోర్టు విలువైన సమయం కూడా వృథా అవుతుంది. ఇలా అధికారులు, కోర్టు సమయాన్ని వృథాచేసేవారిపై భారీ ఖర్చులు విధించడానికి బలమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని కోర్టు అభిప్రాయపడింది.