Begin typing your search above and press return to search.

జగన్ కి విజయసాయి దూరం కావడం వెనక ?

ఒకనాడు వైసీపీలో నంబర్ 2గా కీలకమైన పాత్ర పోషించిన సాయిరెడ్డి తరువాత కాలంలో జగన్ కి దూరం చేయబడ్డారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2025 3:58 AM GMT
జగన్ కి విజయసాయి దూరం కావడం వెనక ?
X

విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరం కావడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయని అది ఈ రోజు సడెన్ గా తీసుకున్న నిర్ణయం కానే కాదని అంటున్నారు. ఒకనాడు వైసీపీలో నంబర్ 2గా కీలకమైన పాత్ర పోషించిన సాయిరెడ్డి తరువాత కాలంలో జగన్ కి దూరం చేయబడ్డారని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవి చూశాక విజయసాయిరెడ్డి పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ఎన్నో కీలకమైన సూచనలు జగన్ కి చేశారని వాటిని ఆయన అంతగా పట్టించుకోలేదని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ మీద పూర్తి అవగాహన ఉన్న సాయిరెడ్డి పార్టీ మళ్ళీ పునరుత్తేజం కావడానికి ఏమేమి చేయాలో అవి చేయాలని సూచించినట్లుగా చెబుతున్నారు.

కానీ జగన్ చుట్టూ ఉన్న ఒక బలమైన కోటరీ ఆయనను సైడ్ చేస్తూనే ఉందని దాంతో ఆయన అసంతృప్తికి లోను అయ్యారని అంటున్నారు. ఇక పార్టీలో ఐప్యాక్ కి ఎంతో విలువ ఇస్తూ వారి సూచనలనే జగన్ అమలు చేస్తూ పోవడం పట్ల కూడా సాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.

ఐప్యాక్ ఇచ్చే నివేదికలను నమ్ముకుని పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడా జరిగిందని అంటున్నారు. విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఐప్యాక్ చెప్పిందని నెల్లూరు లోక్ సభ నుంచి ఆయనకు పోటీ చేయించారని అంటున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడా విజయసాయిరెడ్డిని బాధించింది అని అంటున్నారు.

ఇక సోషల్ మీడియా వింగ్ లో ఒకనాడు విజయసాయిరెడ్డి ఎంతో కీలకమైన పాత్ర పోషించారని కానీ ఆ తరువాత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆయన కుమారుడికి ప్రాధాన్యత దక్కిన తరువాత విజయసాయిరెడ్డి మనుషులను అందులో నుంచి తొలగించారని ఆయన దీని మీద తీవ్ర మనస్తాపానికి గురి అయ్యారని అంటున్నారు.

మరో వైపు పార్టీలో రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవిని సజ్జలకు ఇవ్వడంతో పాటు విజయసాయిరెడ్డిని లూప్ లైన్ లోకి పెట్టడం కూడా బాధించింది అని అంటున్నారు ఇక మరో నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మొత్తం అన్ని అనుబంధ విభాగాలను కంట్రోల్ లోకి తీసుకోవడం పార్టీలో ఆయన ప్రాధాన్యత కూడా పెరిగిపోవడంతో కూడా విజయసాయిరెడ్డి అసంతృప్తికి లోను అయ్యారని అంటున్నారు.

ఇంకో వైపు లిక్కర్ స్కాం లో కూడా ఆయనని ఇరికించడానికి కొందరు చేసిన ప్రయత్నాలతో ఆయన విసిగి వేసారి రాజకీయాలకూ పార్టీకి ఒక దండం పెట్టారని అంటున్నారు. జగన్ వద్ద ఈ విషయాలు ప్రస్తావించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడుతాను అని చెప్పినా లైట్ తీసుకోవడం వల్లనే ఈ కఠిన నిర్ణయానికి ఆయన వచ్చారు అని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి చాలా కాలంగా మధన పడుతున్నారని చివరికి అది బడబాగ్నిగా మారి బద్ధలైందని అంటున్నారు.