బంగ్లాదేశ్ కు అంత సీన్ లేదు... మీడియాపై బీఎస్ఎఫ్ స్ట్రాంగ్ రియాక్షన్!
ఇటీవల భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దులో సైనికుల మధ్య గొడవ జరిగిందనే చర్చ ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 8 Jan 2025 4:30 PM GMTఇటీవల భారత్ – బంగ్లాదేశ్ సరిహద్దులో సైనికుల మధ్య గొడవ జరిగిందనే చర్చ ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో... భారత్ లో సుమారు 5 కిలో మీటర్ల మేరకు భూభాగాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఆక్రమించుకొందంటూ ఆ దేశానికి సంబంధించిన మీడియాలోని కొన్ని వర్గాలు మీడియాలో కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై బీఎస్ఎఫ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.
అవును.. భారత్ లో భూభాగాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఆక్రమించిందంటూ ఆ దేశానికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. దీనిపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా... “ఒక్క అంగుళం భారత భూభాగాన్ని తీసుకోలేదు.. తీసుకోలేరు” కూడా అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.
ఈ సందర్భంగా స్పందించిన బీఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రంటియార్... నార్త్ 24 పరగణాస్ జిల్లాలో రాంఘాట్ గ్రామంలోని బగ్డా బ్లాక్ లోని భూభాగంపై సందేహాలు వ్యక్తమవూతున్నాయని.. ఇక్కడ ఇంటర్నేషనల్ బోర్డర్ కొడల్యా నదీ తీరం వెంబడి వెళుతుందని.. ఈ సరిహద్దు వెంట బీఎస్ఎఫ్ గస్తీలో ఎటువంటి మార్పూ జరగలేదని తెలిపింది.
ఇక్కడ సరిహద్దుకు ఇరువైపులా కచ్చితమైన హద్దులను గుర్తించి.. స్తంభాలు పాతి, కంచే వేసి ఉందని స్పష్టం చేసింది. 1975 భారత్-బంగ్లా బోర్డర్ గైడ్ లైన్స్ ఆధారంగా భారత దేశానికి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బంగ్లాదేశ్ కు చెందిన బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ (బీజీబీ) వాటి వాటి విధులను ప్రశాంతంగా నిర్వహిస్తున్నాయని పేర్కోంది.
ఇదే సమయంలో.. కంచె లేని చోట్ల కూడా బంగ్లాదేశీల స్మగ్లింగ్, చొరబాట్లు వంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు బీఎస్ఎఫ్ వివరించింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. బంగ్లాదేశ్ కు చెందిన మీడియాలోని కొన్ని వర్గాలు మాత్రం పూర్తి బాధ్యతా రాహిత్యంతో నిరాధారమైన వాటిని ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యింది.