Begin typing your search above and press return to search.

కాస్తంత ప్రిపేర్ అయి రావొచ్చుగా బొత్స బాబాయ్?

ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన వీరావేశంతో చిందులు తొక్కుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 5:07 AM GMT
కాస్తంత ప్రిపేర్ అయి రావొచ్చుగా బొత్స బాబాయ్?
X

సీరియస్ అంశాల మీద మాట్లాడేటప్పుడు కామెడీ వ్యాఖ్యలు చేయకూడదు. గతానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయన్నది మర్చిపోకూడదు. లాజిక్ గా లేని వాదనను ఏ స్థాయి నాయకుడి నోటి నుంచి వచ్చినా ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇలాంటివేళలో తాము చేసే డిమాండ్ లో విషయం ఉందా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకొని మాట్లాడాలే కానీ.. మైకులు ఉన్నాయి కదా అని మాట్లాడితే.. సోసల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో కామెడీ కావటం ఖాయం. ఈ విషయాన్ని గుర్తించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే సదరు నేతకు మాత్రమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీకి కూడా నష్టమే అన్న విషయాన్ని గుర్తించాలి. ఇదంతా ఎందుకంటే.. వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన వీరావేశంతో చిందులు తొక్కుతున్నారు. మీడియా మైకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షమని.. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం అధికార పార్టీ ఇవ్వటం లేదని ఆయన మండిపడుతున్నారు. ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా ఇవ్వాలని గవర్నర్ ప్రసంగం సందర్భంగా డిమాండ్ చేశాన్నారు.

ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి సభలో మాట్లాడాలంటే తమకు ప్రతిపక్ష హోదా కావాలని.. తాము ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలమని.. అందుకే హోదా కావాలని అడుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీడియా ద్వారా ప్రజల సమస్యల్ని ప్రస్తావిస్తామని.. అవససరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడతామని పేర్కొన్నారు. ఇన్ని మాటలు చెప్పిన బొత్స.. మొత్తం ఎమ్ముల్యేల్లో 10 శాతం సీట్లు సంపాదించిన పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుందన్న చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నట్లు?

ఇక్కడే మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఏమంటే.. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి సభకు రాము అని మాట్లాడే బదలు.. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్లి.. అక్కడ ప్రభుత్వ వైఫల్యాల మీద విరుచుకుపడొచ్చు కదా? ఒకవేళ తాము మాట్లాడే ప్రయత్నం చేస్తే.. దానికి స్పీకర్ అంగీకరించకుంటే ఆ విషయాన్ని అసెంబ్లీ బయట ఉన్న మీడియాతో మాట్లాడటం ద్వారా.. తాము చేస్తున్న ప్రయత్నాలకు అధికార పార్టీ ఎలా గండి కొడుతుందో ఉదాహరణతో సహా చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా?

అలాంటివేమీ లేకుండా మంకు పట్టు పట్టిన పిల్లాడి మాదిరి.. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి తాము అసెంబ్లీకి హాజరు కామన్న వాదనలో అర్థం లేదన్న విషయాన్ని బొత్స గుర్తిస్తే మంచిది. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షమనే మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. లాజిక్ లకు ఏ మాత్రం సెట్ కావన్నది మర్చిపోకూడదు. ప్రజల పక్షమే అయినప్పటికీ.. దానికి అవసరమైన బలాన్ని అదే ప్రజలు వైసీపీకి ఇవ్వలేదంటే.. అందుకు కూడా వారు అర్హులు కారన్న తీర్పును అలెడ్రీ ఇచ్చేశారు కదా?

అలాంటప్పుడు ప్రజల్లో తాము కోల్పోయిన నమ్మకాన్ని తీసుకొచ్చే అంశం మీద ఫోకస చేయాలి కదా? అందుకు నిత్యం అసెంబ్లీకి వచ్చి.. పరిమితంగా ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకొని.. ప్రజల పక్షాన నిలబడాలి. పోరాడాలి. అలాంటిదేమీ చేయకుండా హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రామన్న మాటల్లో అర్థం లేదన్నది మర్చిపోకూడదు. ఇలాంటి అంశాల మీద మాట్లాడే ముందు బొత్స బాబాయ్ కాస్తంత ప్రిపేర్ అయితే బాగుండన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.