Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రలో కాక రేపుతున్న ఇద్దరు మితృలు !

విశాఖ, విజయనగరం జిల్లాలకు వీరిద్దరూ రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతం మీద ప్రభావం చూపుతున్నారు.

By:  Tupaki Desk   |   19 May 2024 12:30 AM GMT
ఉత్తరాంధ్రలో కాక రేపుతున్న ఇద్దరు మితృలు !
X

ఉత్తరాంధ్రలో కీలక రాజకీయ నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖ, విజయనగరం జిల్లాలకు వీరిద్దరూ రెండు దశాబ్దాలుగా ఆ ప్రాంతం మీద ప్రభావం చూపుతున్నారు.

1999లో కాంగ్రెస్ నుంచి బొత్స బొబ్బిలి ఎంపీగా, టీడీపీ నుంచి గంటా అనకాపల్లి ఎంపీగా ఇద్దరూ ఒకేసారి గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి బొత్స, చోడవరం నుంచి గంటా ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా పీసీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బొత్స సత్యనారాయణ తొలిసారి ఓటమిని చవి చూస్తే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓటమి ఎరుగని నాయకుడిగా నియోజకవర్గాలు మారుస్తూ గంటా శ్రీనివాసరావు తన రాజకీయ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.

రాజకీయాలకు వచ్చిన తొలి రోజుల్లో ఇద్దరూ మంచి మిత్రులు. ఇద్దరూ కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రివర్గ సహచరులుగా కలిసి పనిచేశారు. 2014 తర్వాత గంటా టీడీపీకి తిరిగి వెళ్లడంతో రాజకీయ మిత్రులుగా ఉన్న బొత్స, గంటా ప్రత్యర్థులుగా మారిపోయారు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా ఉన్ననాటి నుంచే ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం అయింది. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో

ఎప్పుడూ లేనిదీ ఇప్పుడు ఇద్దరూ మిత్రులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. జూన్ 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంట శ్రీనివాసరావు జోస్యం చెప్తుంటే, బొత్స సత్యనారాయణ ఇంకోక అడుగు ముందుకేసి అదే జూన్ 9న విశాఖ వేదికగా జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనీ, మాజీ మంత్రి హోదాలో గంటా శ్రీనివాసరావుకు కూడా ఆహ్వానం పంపుతామని బొత్స కౌంటర్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో జూన్ 4న ఏం జరుగుతుంది ? ఫలితాలు ఎలా వస్తాయి ? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.