బొత్స ఝాన్సీ విజయం నల్లేరు మీద నడకే!
విశాఖ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి విజయం ఖాయమైందా అంటే జరుగుతున్న పరిణామాలు వేసుకుంటున్న అంచనాలు అవును అనే అంటున్నాయి
By: Tupaki Desk | 5 May 2024 3:04 PM GMTవిశాఖ ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి విజయం ఖాయమైందా అంటే జరుగుతున్న పరిణామాలు వేసుకుంటున్న అంచనాలు అవును అనే అంటున్నాయి. ఆమె రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, విశాఖ ఆడపడుచు ట్యాగ్, పక్కా లోకల్ అన్న ముద్ర ఇవన్నీ ఆమె విజయాన్ని కన్ ఫర్మ్ చేస్తున్నాయని అంటున్నారు. ఆమె ప్రత్యర్థిగా టీడీపీ కూటమి నుంచి శ్రీ భరత్ ఉన్నారు.
ఇదిలా ఉంటే విశాఖ మీద తన విజన్ ఏమిటి అన్నది బొత్స ఝాన్సీ లక్ష్మి గట్టిగా చెబుతున్నారు. విశాఖ సమస్యల మీద వాటిని పరిష్కరించే తీరు పైనా ఆమె పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారు. దాంతో బొత్స ఝాన్సీ విజయానికి ఏకంగా ఎనిమిది కారణాలే ఉన్నాయని అంటున్నారు.
అవేంటో ఒక్కసారి కనుక చూస్తే ఆమెకు ఉన్న విశాఖ ఫోకస్ కరెక్ట్ గా ఉంది. అదే టైం లో విశాఖ గురించి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తాను ఏ కారణం చేత గెలుస్తాడో కూడా చెప్పలేకపోతున్నారు.ఇంతకీ బొత్స ఝాన్సీ విజయానికి ఆ ఎనిమిది కారణాలు ఏమిటంటే ఆమె అద్భుతంగా చేస్తున్న ప్రసంగాలే మొదటి కారణం అంటున్నారు.
ఆమె ఉన్నత విద్యావంతురాలు. దాంతో బొత్స ఝాన్సీ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ప్రతీ చిన్న అంశాన్ని ఎంతో ఉన్నతంగా ఆలోచించి మాట్లాడుతున్నారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే మొదటి వరసలో నేనే ఉంటానని అంటున్నారు.
ఇక ఆమె రెండో కారణం చూస్తే కనుక గతంలో ఎంపీగా చేసిన అభివృద్ధి ఉంది. ఆమె గతంలో విజయనగరం, బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు చేసిన మంచి పనులు ఆమెకు ఇప్పుడు విశాఖ ఎన్నికల ముంగిట ఆమెకు భారీ ప్లస్ గా మారాయి. అప్పట్లో ఎన్నో అభివృద్ధి పనులు ఆమె హయాంలోనే జరిగాయి. రైల్వే గేట్ల దగ్గర నుంచి విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సమస్యలు, విశాఖ పోర్టు సమస్యలు ఎన్నో పరిష్కారమయ్యాయని గుర్తు చేస్తున్న వారు ఉన్నారు.
ఇక ఆమె విశాఖ ఎంపీని తానే అని ధీమాగా చెప్పడానికి మూడో కారణం ఏమిటి అంటే ఉత్తరాంధ్ర ఆడపడుచుగా ఆమెకు మంచి గుర్తింపు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఆడపడచుగా ఆమెను ప్రజలు ఆదరించడం విశేషంగా ఉంది. ఆమె తమ ఊరి బిడ్డ అని భావించడం ఈ ఎన్నికల్లో ఆమెకు మంచి అవకాశంగా మారుతొంది. ఒక విధంగా ఇది బలమైన సెంటిమెంట్ గా మారి ఎంతో ప్లస్ గా మారింది.
ఇక నాలుగో కారణం చూస్తే కనుక పార్లమెంటులో రెండు సార్లు ఎంపీగా చేసినపుడు ఆమె ఇచ్చిన ప్రసంగాలుగా ఉన్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు. దేశంలో నెలకొన్న ఎన్నో సమస్యలపై ఆమె తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తీకరించారు. అంతేకాదు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా తొలుత ప్రస్తావించడం కూడా ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
ఇక అయిదవ కారణం చూస్తే కనుక విశాఖ సమస్యల మీద ఆమె చేసిన పోరాటంగా ఉంది.తాను రెండుసార్లు ఎంపీగా గెలిచి కూడా తానేదో బొబ్బిలి, విజయనగరానికి పరిమితం అనుకోలేదు. మొత్తం ఉత్తరాంధ్ర సమస్యలపైన ఆమె పార్లమెంట్ లో తనదైన శైలిలో గొంతెత్తారు. అలా ఆనాడే విశాఖ పట్నం సమస్యలపై పోరాడి ఎన్నింటినో పరిష్కరించారు. ఆనాడే విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్టులను ప్రస్తావించడం ద్వారా విశాఖ అభివృద్ధిలో తానూ ఉన్నాను అనిపించుకున్నారు.
ఇక ఆమె విశాఖ ఎంపీ అవుతారు అని చెప్పే బలమైన ఆరవ కారణం ఆమె సామాజిక వర్గం బలం. ప్రధానంగా చూస్తే కనుక విశాఖ పార్లమెంటు పరిధిలో 2.3 లక్షలున్న కాపులు అంతా కూడా ఈసారి ఎన్నికల్లో ఏకపక్షంగా బొత్స ఝాన్సీకి మద్దతు పలుకుతున్నారు. ఇక సామాజికవర్గాల వారీగా వైసీపీ ఇచ్చిన సీట్లు కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కూడా అవే బొత్స ఝాన్సీ గెలుపునకు గట్టిగా పనిచేస్తున్నాయి.
ఇదే విధంగా ఆమె గెలుపునకు ఏడో కారణం ఏమిటి అన్నది విశ్లేషించుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ళ పాటు అమలు చేస్తూ వస్తున్న సంక్షేమ పథకాలుగా ఉన్నాయి. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులు అంతా వీటి మీదనే ఆధారపడి ఉన్నారు. అలా భారీ ఎత్తున సంక్షేమ పథకాల అమలు అన్నది కేవలం ఏపీలోనే జరిగింది. అందుకే ఇది పేదవాడికి-పెత్తందార్లకి మధ్య పోరాటంగా వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అభివర్ణిస్తున్నారు.
ఇక బొత్స ఝాన్సీలక్ష్మి ఎంపీ ఎందుకు అవుతారు అన్న దానిని వివరించే ఎనిమిదో కారణం ప్రత్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్ పోటీ పడలేక పోవడం అన్నదే అంటున్నరు. పోలిక పరంగా చూస్తే శ్రీ భరత్ కి రాజకీయానుభవం లేదు.సామాజిక సమస్యలపై అవగాహనలేదని అంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజల సమస్యలు ఆయనకు తెలియదు అని విమర్శలు ఉన్నాయి.
అంతే కాదు విశాఖలోని గీతం యూనివర్శిటీ చుట్టూ అలుముకున్న అవినీతి ఆరోపణలు ఆక్రమణలతో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్ధి తలనొప్పులు ఎదుర్కొంటున్నారు అనుకుంటున్నారు. మరో వైపు ఆయనకు సొంత సామాజిక వర్గం నేతలెవరూ కలిసి రావడం లేదన్న ప్రచారం బలంగా ఉంది.
ఇలా చూస్తే ఇటు వైపు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బొత్స ఝాన్సీ సీనియర్ గా ఉన్నారు. అంతేకాదు రెండుసార్లు ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో తన ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో శ్రీ భరత్ ఆమె ముందు సమ ఉజ్జీగా లేరని అంటున్నారు. అలా కనుక చూస్తే విశాఖ ఎంపీ సీటు శ్రీ భరత్ కి ఇచ్చి చంద్రబాబు వ్యూహాత్మక తప్పు చేశాడన్నది కూడా ఒక విశ్లేషణగా ఉంది. మొత్తానికి చూస్తే కచ్చితమైన ఎనిమిది కారణాలతో వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ గెలుపు ఇక నల్లేరు మీద నడకే అంటున్నారు.
ఈ రోజున చూసినా ఆమెకు అనుకూలంగానే విశాఖలో రాజకీయం సాగుతోంది అన్నది కూడా అంతా అంటున్న మాట.