బొత్స యాక్టివ్ అయ్యారు...వ్యూహమేంటో ?
విశాఖకు తరలివచ్చిన విశాఖకు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైందని బొత్స కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
By: Tupaki Desk | 29 July 2024 3:36 AM GMTఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యాక్టివ్ అయ్యారు. ఆయన విశాఖలో మీడియా సమావేశం పెట్టి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి మీద ఘాటు విమర్శలు చేశారు. విశాఖకు తరలివచ్చిన విశాఖకు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైందని బొత్స కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాదు సంధ్యా ఆక్వా మెరైన్ కంపెని బీజేపీ అధ్యక్షురాలు బంధువులదని ఆరోపణలు కూడా వచ్చాయని బొత్స అన్నారు. దాంతో ఈ వ్యవహారం మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాల్సిందే అని స్పష్టం చేశారు.
అంతే కాదు ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్ లో ఇదే విషయం మీద కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన కోరారు. పాతిక వేల వేల కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదని అన్నారు. ఇక విశాఖలో కంటైనర్ పట్టుబడిన సమయంలో చాలా విమర్శలు వచ్చాయని కూడా బొత్స గుర్తు చేశారు. అవి సరిగా ఎన్నికల సమయంలో ఈ డ్రగ్స్ పట్టుబడ్డాయి కనుక పెద్దగా దృష్టి పెట్టలేదని ఆ రోజులలో సమయం అంతా రాజకీయ ఆరోపణలకే సరిపోయిందని అన్నారు.
అంతే కాదు విశాఖ కోసం ఆలోచించే వారు అందరూ ఈ విషయంలో విచారణ కోరాలని బొత్స డిమాండ్ చేశారు. తాను చూసిన విద్యా శాఖ మీద కూడా దర్యాప్తు చేసుకోవచ్చు అన్నారు. టీచర్ల బదిలీలు అక్రమాలు, ఆరోపణలపైన ప్రభుత్వం ఏమైనా విచారణ చేసుకోవచ్చు అని బొత్స అన్నారు. తాను పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాతే బదిలీలు అమలు లోకి రావాలని స్వయంగా నోట్ పెట్టానని గుర్తు చేశారు.
ఈ విషయంలో కనుక తనకు వెస్ట్రన్ ఇంట్రెస్ట్ వుంటే ముఖ్యమంత్రి రాటిఫికేషన్ కోసం ఎందుకు ఫైల్ పంపిస్తానని ఆయన ప్రశ్నించారు టీచర్ల బదిలీలలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణను ప్రభుత్వం కోరుకుంటే జరిపిస్తారని తాను వద్దంటే మాత్రం వారు ఆగుతారా అని బొత్స ప్రశ్నించారు.
చంద్రబాబు మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయని ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారని అన్నారు. తాము ఏ కూటమిలో లేమని తమ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు వచ్చి సంఘీభావం మాత్రమే తెలిపాయని కూడా ఆయన వివరణ ఇచ్చారు.
ఇక తన జిల్లాలో మాజీ సైనికుడు ఇంటిని రాజకీయ కక్షతో కూల్చేస్తారా ఇదేమి విధానం అని బొత్స మండిపడ్డారు. మొత్తానికి చాలా విషయాల మీద బొత్స మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ చూస్తూంటే బొత్స రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయినట్లుగానే ఉన్నారు. మరి ఆయన వ్యూహం ఏమిటి అన్నది కూడా చర్చ సాగుతోంది. బొత్స జనసేన టీడీపీలలో చేరుతారు అని అప్పట్లో ప్రచారం సాగింది.
అయితే ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అంతే కాదు తాడేపల్లిలో జగన్ నిర్వహించిన పార్టీ సమీక్షకూ హాజరయ్యారు. దాంతో ఆయన వైసీపీలో కొనసాగుతారని అంటున్నారు. మొత్తం మీద బొత్స యాక్టివ్ కావడం మంచి పరిణామమని వైసీపీ నేతలు అంటూంటే రాజకీయ నేతలు యాక్టివ్ అయితేనే లైం లైట్ లో ఉంటారని అపుడే వారికి ఆప్షన్లు కూడా ఉంటాయని మరో వైపు చర్చ సాగుతోంది. చూడాలి మరి.