Begin typing your search above and press return to search.

పవన్ని కెలుకుతున్న బొత్స... రిజల్ట్ ఏంటో...?

మరి బొత్స అయితే డియర్ పవన్ అని ఎంతలా ట్వీట్లు చేసినా ఆయన నుంచి రెస్పాన్స్ అయితే ఉంటుందా అన్నది డౌట్.

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:04 AM GMT
పవన్ని కెలుకుతున్న బొత్స... రిజల్ట్ ఏంటో...?
X

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మధ్హ్య జోరు పెంచారు. ప్రత్యర్ధుల మీద విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన కొడాలి నాని పేర్ని నాని మాదిరిగా కాకుండా పెద్ద మనిషిగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలీ అంటే వర్తమాన రాజకీయాలు పాడైపోయాయని ఒక సీనియర్ గా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రత్యర్ధులను విమర్శిస్తూంటారు.

ఆయన పవన్ కళ్యాణ్ణి చాలా జాగ్రత్తగా విమర్శిస్తారు. అది కూడా సున్నితంగా ఉంటుందని అంటారు. సెలిబ్రిటీ పార్టీ జనసేన అంటారు. పవన్ని పట్టుకుని డియర్ పవన్ కళ్యాణ్ అని తన ట్విట్టర్ ద్వారా పిలుస్తూ ప్రశ్నలు వేస్తారు. ఆ మధ్య బైజూస్ సంస్థ ఏపీ విధ్యా శాఖతో ఒప్పందాలు చేసుకున్న దాని మీద పవన్ విమర్శలు చేస్తే ట్విట్టర్ వేదికగా బొత్స రెస్పాండ్ అయి ప్రశ్నలు సంధించారు.

బైజూస్ సంస్థ ఒప్పంద వివరాలు చెబుతూ పవన్ కి తాను ట్యూషన్ చెబుతాను అని చిన్న సెటైర్ల్ పేల్చారు దానికి పవన్ నవ్వుకుని ఉంటారు. అందుకే నో రిప్లై. ఇపుడు మరో విషయం మీద డియర్ పవర్ కళ్యాణ్ మీరేమంటారు అంటూ కెలికారు బొత్స. ఇంతకీ జరిగింది ఏంటి అంటే సాలూరులో ఈ మధ్య గిరిజన విశ్వ విద్యాలయం శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు సీఎం జగన్.

ఆ మీటింగ్ కి అటెండ్ అయిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ ఏపీలో విద్యా విధానం బాగుందని అన్నారు. ద్విభాషా సూత్రాన్ని పాఠశాలలలో అమలు చేస్తున్నారు భేష్ అన్నారు. అంటే తెలుగు ఇంగ్లీష్ బోధన అన్న మాట. ప్రధాని మోడీ కూడా దీన్ని మెచ్చుకున్నారని పేర్కొన్నారు.

దాన్ని ఇపుడు పవన్ దృష్టికి తెస్తూ మీ పొత్తు పార్టీ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి మా విద్యావిధానం మెచ్చుకున్నారు, మీ సంగతేంటి పవన్ అంటూ గట్టిగానే కెలికారు బొత్స. అంటే ఏపీలో ఇంగ్లీష్ విద్యా విధానం మీద జనసేన టీడీపీ రెండూ కూడా విమర్శలు చేస్తూ వస్తున్న నేపధ్యంలో కేంద్రం మమ్మల్ని మెచ్చుకుంది చూశారా అంటూ బొత్స పవన్ కి ఇలా ట్వీట్ చేశారన్న మాట.

మరి దీనికి పవన్ ఏమి చెబుతారో అన్న ఆసక్తి అయితే ఉంది కానీ పవన్ అయితే ఇలాంటి వాటికి రిప్లై ఇవ్వరని అందరికీ తెలుసు అంటున్నారు. ఆయన వారాహి మీటింగ్ లో మాట్లాడుతారు. ఆయన డైరెక్ట్ గా జగన్ మీదనే విమర్శలు చేస్తారు తప్ప ఎవరినీ పెద్దగా పట్టించుకోరని అంటారు. ఇక ఆయా నియోజకవర్గాలకు వచ్చినపుడు మాత్రం కొన్ని కామెంట్స్ లోకల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేల మీద చేస్తూ ఉంటారు.

మరి బొత్స అయితే డియర్ పవన్ అని ఎంతలా ట్వీట్లు చేసినా ఆయన నుంచి రెస్పాన్స్ అయితే ఉంటుందా అన్నది డౌట్. హోల్ మొత్తంగా వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఈ ప్రభుత్వం పోవాలని గట్టిగా కోరుకుంటున్న పవన్ చిన్న విషయాల మీద ఇది బాగుంది అది బాలేదు అని చెప్పడం అలా ఆయన నుంచి ఆశించడం కుదిరేదేనా బొత్సా అని అంతా అంటున్నారు. అయినా బొత్స వారి ఉత్సాహం అలాంటిది మరి అని అంటున్నారు. బొత్స డియర్ పవన్ అంటూ చేస్తున్న ఈ సరికొత్త రాజకీయం ఆసక్తిగానే ఉంది మరి.