Begin typing your search above and press return to search.

లోకేష్ అరెస్ట్...ఆమె ప్రకటన దేనికి సంకేతం...?

లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాట్లాడుతూ లోకేష్ ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు అని బాంబు లాంటి వార్తనే బయటపెట్టారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 5:13 PM GMT
లోకేష్ అరెస్ట్...ఆమె ప్రకటన దేనికి సంకేతం...?
X

ఏపీ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది అన్నది అర్ధం కావడంలేదు. ఎన్నికలు చూస్తే నెలల దగ్గరకు వచ్చేశాయి. రాజకీయం చూస్తే దూకుడు మీద ఉంది. లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబుని ఈ టైం లో తీసుకెళ్ళి జైలులో పెట్టడం అంటేనే ఏపీ పాలిటిక్స్ స్పీడ్ ఏ రేంజిలో ఉందో చూడాల్సిందే అంటున్నారు.

ఇదిలా ఉండగా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో భారీ స్కాం జరిగింది అంటూ బాబుని జైలు పాలు చేశారు. అపుడే వినిపించిన పేరు లోకేష్. ఆయన్ని కూడా ఒకటి రెండు రోజుల తేడాతో అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు.

దానికి బలం చేకూర్చేలా నారా లోకేష్ పాత్ర కూడా ఈ స్కాం లో ఉంది అని ఏపీ సీఐడీ అధికారులు మీడియా ముఖంగానే ప్రకటించారు. ఇక వైసీపీ నేతలు కూడా లోకేష్ పాత్ర ఉంది ఆయన సైతం అరెస్ట్ కి సిద్ధంగా ఉండాలని చెబుతూ వచ్చారు. అయితే వారం రోజులు దాటినా ఆ ఊసే లేకుండా పోయింది.

దానికి తోడు ఇపుడు లోకేష్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఆయన టీడీపీ ఎంపీల ద్వారా చంద్రబాబు అరెస్ట్ ని పార్లమెంట్ లో లేవనెత్తేలా చూస్తున్నారు. జాతీయ స్థాయిలో బాబు అరెస్ట్ చర్చకు వస్తే అది కాస్తా తమకు ఎంతో కొంత మేలు చేస్తుందని ఆయన భావిస్తున్నారు.

మొత్తానికి చూస్తే లోకేష్ అరెస్ట్ అన్నది ఉంటుందా అంటే ఇప్పటికి అయితే ఆ దిశగా ఏమీ అడుగులు పడడంలేదు. అంతా బాబు అరెస్ట్ రిమాండ్ గురించే ఆలోచిస్తూంటే లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాట్లాడుతూ లోకేష్ ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు అని బాంబు లాంటి వార్తనే బయటపెట్టారు.

రాజమండ్రీలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ కలసి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. తెలుగు మహిళలు వెంట రాగా ర్యాలీగా సాగిన ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చంద్రబాబుని స్కాం పేరుతో అరెస్ట్ చేసిన ప్రభుత్వ పెద్దలు నారా లోకేష్ ని కూడా వదలరని అంటున్నారు.

మరి అది నిజమా కాదా అంటే ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి అవును అనే అనుకోవాలని అంటున్నారు. అయితే ఇపుడు బాబు అరెస్ట్ తో ఏర్పడిన పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ అదుపు చేసే ప్రయత్నంలో వైసీపీ బిజీగా ఉంది. బాబు అరెస్ట్ తరువాత ఊహించినంత సానుభూతి రాలేదు,

సరే అనుకునేలోగానే జనసేన పొత్తు పేరుతో ఇచ్చిన మద్దతు దాంతో టీడీపీకి వచ్చిన బలం ధైర్యం ఇవన్నీ కూడా వైసీపీ విశ్లేషించుకుంటోంది. దాంతో లోకేష్ అరెస్ట్ అన్నది ప్రస్తుతానికి ఉండబోదు అనే అంటున్నారు. అయితే బ్రాహ్మణి ప్రకటన చేయడం వెనక కారణాలు ఏమిటి అన్నది మాత్రం తెలియరావడంలేదు. ఏది ఏమైనా టీడీపీకి ఇది గడ్డు కాలం, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అని అంతా అంటున్నారు.