Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి వేదిక అదే ...?

ఇప్పటికే రాజమండ్రిలో గత కొంతకాలంగా ఉంటూ పార్టీ నేతలతో వరస భేటీలు జరుపుతున్నారు. సో నారా లోకేష్ అరెస్ట్ అయిన ప్రాంతమే బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి వేదిక అవుతుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 3:30 PM GMT
బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి వేదిక అదే ...?
X

టీడీపీ చంద్రబాబు అరెస్ట్ ని ఇపుడిపుడే కొంత తీసుకుంటోంది. మామూలు అవుతోంది. పార్టీని నడపడం మీద సీనియర్ నేతలు ఫోకస్ పెట్టారు. మొదట్లో ఉన్న గందరగోళం ఇపుడు లేదు. ఎందుకంటే పార్టీలో పెద్ద తలకాయలు అందరినీ కలిపి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. దాంతో పార్టీని ఎలా నడపాలో వారు చూసుకుంటున్నారు.

మరో వైపు నారా లోకేష్ అరెస్ట్ ని ఎలా ఎదుర్కోవాలో కూడా యాక్షన్ కమిటీ డిసైడ్ చేసింది. ఈ మేరకు తాజాగా సమావేశం అయిన కమిటీ మెంబర్స్ దీని మీదనే తీవ్రంగా చర్చించారు. లోకేష్ మీద ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం అంటూ ఏ 14గా కేసు ఫైల్ చేశారు. దాంతో ఢిల్లీ నుంచి లోకేష్ వచ్చిన మరుక్షణం ఆయన్ని అరెస్ట్ చేస్తారు అని కూడా అనుమానాలు ఉన్నాయి.

అయితే లోకేష్ అరెస్ట్ ని ఎదుర్కోవడానికే జనసేనతో కలసి జేయేసీని ఏర్పాటు చేస్తున్నారు అని తెలుసోంది. ఇక లోకేష్ పాదయాత్రను చేపట్టడానికి రెడీ అవుతున్నారు. ఆయన పట్టుదల వ్యూహం కూడా ఇందులో ఉంది. తనను అరెస్ట్ చేస్తే పాదయాత్రలోనే చేయాలని అలా చేస్తే తనకు అనూహ్యమైన జనం మద్దతు దక్కుతుంది అని అంటున్నారు.

అందుకోసమే లోకేష్ తిరిగి ప్రారంభించనున్న పాదయాత్రకు భారీగా జన సమీకరణ చేస్తారని తెలుస్తోంది. అటూ ఇటూ టీడీపీ జనసేన ఉంటాయని అంటున్నారు. అంటే లోకేష్ ని అరెస్ట్ చేసినా దాని నుంచు భారీ రాజకీయ ప్రయోజనం పొందడంతో పాటు అధికార వైసీపీ మీద ఉవ్వెత్తున ప్రజా వ్యతిరేకత లేచేలా టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది అంటున్నారు. అంటే చంద్రబాబు అరెస్ట్ నాటి తప్పులను చేయకుండా టీడీపీ జాగ్రత్త పడుతోంది అన్న మాట.

ఇక ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే పాదయాత్రను కొనసాగించడానికి ఆయన సతీమణి బ్రాహ్మణి రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. ఆమె ఇప్పటికే రాజమండ్రిలో గత కొంతకాలంగా ఉంటూ పార్టీ నేతలతో వరస భేటీలు జరుపుతున్నారు. సో నారా లోకేష్ అరెస్ట్ అయిన ప్రాంతమే బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీకి వేదిక అవుతుంది అని అంటున్నారు.

ఆ విధంగా ఆమె గ్రాండ్ గా జనం మధ్యనే తన రాజకీయ ప్రయాణానికి అడుగులు వేస్తారు అని అంటున్నారు. ఈ విధంగా టీడీపీ బహుముఖ వ్యూహాలతో ముందుకు సాగుతోంది అని అంటున్నారు. అయితే లోకేష్ ని అరెస్ట్ చేయాలన్న పట్టుదలతో వైసీపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఆ తరువాత ఏపీలో ఆందోళనలు ఏ విధంగా జరుగుతాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎటూ కట్టుబాట్లు పెట్టి కట్టడి చేస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ సరికొత్త రాజకీయం ఇపుడు రక్తి కట్టించేలా సాగుతోంది.