Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పేరు రాకుండా ఉండేందుకే రంగంలోకి బ్రాహ్మణి!

అదే జూనియర్ ఎన్టీఆర్ పేరు రాకుండా ఉండటం కోసమే బ్రాహ్మణి చుట్టూ టీడీపీ రాజకీయాలు నడిచేలా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 Sep 2023 12:30 AM GMT
ఎన్టీఆర్ పేరు రాకుండా ఉండేందుకే రంగంలోకి బ్రాహ్మణి!
X

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అరెస్టవుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి యాక్టివ్ అయ్యారు. అయితే బ్రాహ్మణిని తెరమీదకు తేవడం వెనుక మరో కారణం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జూనియర్ ఎన్టీఆర్ పేరు రాకుండా ఉండటం కోసమే బ్రాహ్మణి చుట్టూ టీడీపీ రాజకీయాలు నడిచేలా చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

టీడీపీకి ఎప్పుడు ఏ ప్రాబ్లెం వచ్చినా.. అప్పుడు కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తుందనే చెప్పాలి. ఎన్టీఆర్ వచ్చి పార్టీని నడిపిస్తారనే అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయం తర్వాత ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది. ఇప్పటివరకూ బాబు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదు. ఎన్టీఆర్ మౌనం వెనుక కారణం ఏమిటనే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బాబు దూరం పెట్టారనే ఆరోపణలున్నాయి. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారని చెబుతున్నారు.

ఇక ఎన్టీఆర్ పేరు తెరమీదకు రాకుండా బ్రాహ్మణిని రంగంలోకి దించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాబుతో పాటు లోకేష్ కూడా జైల్లో ఉంటే అప్పుడు టీడీపీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. తాత స్థాపించిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్ నడిపించాలని కోరుకునే అభిమానులూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు ప్రాధాన్యత దక్కకుండా ఉండేందుకు బ్రాహ్మణిని ముందుకు తెచ్చారని చెబుతున్నారు. చంద్రబాబు కోడలు, లోకేశ్ భార్య నారా బ్రాహ్మణినే టీడీపీకి నాయకత్వం వహిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు టీడీపీ రాజకీయాలు మొత్తం బ్రాహ్మణి చుట్టూ సాగుతున్నాయి. ఎన్టీఆర్ రావాలనే డిమాండ్లు రాకుండా ఉండేందుకే బ్రాహ్మణిని హైలైట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.