మస్క్ కు షాక్ ఇచ్చిన బ్రెజిల్ !
ఎక్స్ కు సంబంధించి బ్రెజిల్ దేశంలో ఒక ప్రతినిధిని నియమించాలని అక్కడి కోర్టు పలుమార్లు ఆదేశించింది.
By: Tupaki Desk | 31 Aug 2024 6:19 AM GMTప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ను తమ దేశంలో నిషేధిస్తూ బ్రెజిల్ సుప్రీం కోర్టు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాతో పాటుగా ఇరాన్, తుర్కెమిస్థాన్, నార్త్ కొరియా, ఉజ్బెకిస్థాన్, రష్యా, మయన్మార్ దేశాలు తమ దేశాలలో ఎక్ప్ వాడకాన్ని నిషేధించాయి.
ఎక్స్ కు సంబంధించి బ్రెజిల్ దేశంలో ఒక ప్రతినిధిని నియమించాలని అక్కడి కోర్టు పలుమార్లు ఆదేశించింది. అయితే ప్రతినిధిని నియమించేందుకు ఎలాన్ మస్క్ అంగీకరించకపోవడంతో చివరకు దానిని తమ దేశంలో నిషేధిస్తూ ఆదేశాలు ఇఛ్చింది. నిషేధపు ఉత్తర్వులను అతిక్రమించి దానిని ఉపయోగిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.
బ్రెజిల్ లో 80 లక్షల మంది ఎక్స్ ఖాతాను వినియోగిస్తున్నారు. వీరి ఖాతాల వినియోగానికి సంబంధించి ఏవైనా న్యాయవివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ఒక న్యాయ సలహాదారును నియమించాలని సుప్రీం కోర్ట్ సూచించింది. దానిని ఎక్స్ సంస్థ పట్టించుకోకపోవడంతో నిషేధపు ఉత్తర్వులు జారీ చేసింది.