Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ వార్తలు బాయ్ ఫ్రెండ్ తో నైట్ ఔట్ చేసిన ఫలితం!

ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే.. లేనివాడు ఆకలితో బాధపడితే.. ఉన్నవాడు అజీర్తితో బాధపడినట్లన్నమాట

By:  Tupaki Desk   |   30 July 2024 11:30 PM GMT
ఒలింపిక్స్  వార్తలు బాయ్  ఫ్రెండ్  తో నైట్  ఔట్  చేసిన ఫలితం!
X

కొన్ని కోట్ల మందికి అవకాశాలు రాక బాధపడుతుంటే.. కొంతమందికి వచ్చిన అవకాశాలను నిలుపుకోవడం రాక ఇబ్బందులు తెచ్చుకుంటుంటారు. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే.. లేనివాడు ఆకలితో బాధపడితే.. ఉన్నవాడు అజీర్తితో బాధపడినట్లన్నమాట! తాజాగా ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వచ్చిన ఓ క్రీడాకారిణి వ్యవహారం వీటికి సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు.

అవును... ఆమెకు ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే.. టోర్నీ సమయంలో పతకమే లక్ష్యంగా సాధన చేయడం కాకుండా.. ఇందుకు భిన్నంగా అదే ఒలింపిక్స్ లో పాల్గొనడానికి వచ్చిన తన బాయ్ ఫ్రెండ్ అయిన ఓ స్విమ్మర్ తో కలిసి షికార్లు కొట్టింది. ఫలితంగా అనుభవించాల్సినంతా అనుభవించింది.. మరోపక్క అతడి ఫలితాలు తారుమారయ్యాయి!

వివరాళ్లోకి వెళ్తే... బ్రెజిల్ క్రీడాకారిణి ఆనా కరోలినా వియోరా.. స్మిమ్మర్ అయిన తన బాయ్ ఫ్రెండ్ గాబ్రియేల్ శాంటోస్ తో కలిసి శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిందంట. తిరిగి మరునాడు టోర్నీ ప్రదేశానికి వచ్చిందంట. దీంతో... ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది బ్రెజిలియన్ ఒలింపిక్స్ కమిటీ.

ఇందులో భాగంగా... ముందస్తు అనుమతి తీసుకోకుండా, నిబంధనలకు విరుధంగా వ్యవహరించారంటూ కమిటీ ఆమెపై మండిపండింది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఒలింపిక్స్ టోర్నీ నుంచి తొలగించి స్వదేశానికి పంపించేసింది. అయితే... ఈమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయటకు వెళ్లిన విషయం వారికి ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిసిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె బాయ్ ఫ్రెండ్ గాబ్రియేల్ శాంటోస్ మాత్రం తనను క్షమించాలని కమిటీని వేడుకున్నాడు. దీంతో అతడికి మాత్రం అవకాశం ఇచ్చింది. అయితే... శనివారం జరిగిన పురుషుల 4క్ష్100 ప్రీస్టైల్ హీట్స్ లో అతడు ఓడిపోయాడు. దీనిపై బ్రెజిల్ స్విమ్మింగ్ కమిటీ హెడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఒలింపిక్స్ కు వచ్చింది సెలవు తీసుకుని ఎంజా చేయడానికి కాదు.. దేశం విజయం కోసం ఎదురుచూస్తున్న ప్రజల కోసం ఇక్కడికి వచ్చాం అనే విషయం గుర్తించాలి.. అలా గుర్తించనందుకే కరోలినా పై చర్యలు తీసుకున్నామని తెలిపారు.