Begin typing your search above and press return to search.

ముడుచుకుని పడుకునే అలవాటు... ఈ కోటీశ్వరుడికి పెళ్లవ్వడం లేదంట!

అవును... కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. ఈ అందంగాడు వందల రూ.కోట్లకు అధిపతి.

By:  Tupaki Desk   |   16 Aug 2023 12:44 PM GMT
ముడుచుకుని పడుకునే అలవాటు... ఈ కోటీశ్వరుడికి పెళ్లవ్వడం లేదంట!
X

ఈ రోజుల్లో మగాళ్లకు పెళ్లి అవ్వాలంటే తలప్రాణం తోకకొస్తుందని అంటున్నారు. నెలకు ఐదంకెల జీతం సంపాదిస్తున్నా.. అమ్మాయి దొరకడం లేదని బోరుమంటున్నారు. ప్రతీరోజూ గ్లాసులు కడుక్కుంటూ కొలీగ్స్ తో ఆవేదన చెందుతున్నారు! అయితే ఏకంగా వందల కోట్లు ఉన్నా కూడా పెళ్లి కాని ఒక వ్యక్తి కథ గురించి తెలిస్తే.. ఆ బాధ నుంచి ఎంతో కొంత ఉపశమనం పొందొచ్చు!

అవును... కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. ఈ అందంగాడు వందల రూ.కోట్లకు అధిపతి. వయస్సు పెరగకుండా ఉండేందుకు మద్యం తాగే అలవాటు కూడా మానేశాడు. వయస్సు 45 ఏళ్లు అయినా కుర్రాడిలా కనిపిస్తాడు. కండలు తిరిగిన బాడీతో అమ్మాయిల్ని ఆకర్షించేలా ఉంటాడు.

అన్నీ ఉన్నా ఏదో లేదన్నట్లుగా పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తే మాత్రం అమ్మాయిలు పారిపోతున్నారట. దీంతో బ్రియాన్ పెళ్లికాని శ్రీమంతుడిలా మిగిపోయాడు. అయినప్పటికీ పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. కుర్రవాడిలా కనిపించటానికి యవ్వనం కోల్పోకుండా యువకుడిలా ఉండేందుకు ఏడాదిగా రూ.16 కోట్ల ఖర్చు చేస్తున్నాడు.

పెళ్లి అవ్వడానికి ఇన్ని అర్హతలు ఉన్నా కూడా ఎందుకు పెళ్లి కావటంలేదు.. అసలు ఎక్కడ బెడిసికొడుతోంది.. అని ఆరాతీస్తే షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయంట. అవేమిటంటే... పెళ్లికోసం ఇతగాడు పెట్టే కండిషన్స్ కి ఏ అమ్మాయీ ఒప్పుకోవడం లేదంట. తనను పెళ్లి చేసుకోవాలంటే 10 షరతులతో కూడిన లిస్టు చూపిస్తాడట బ్రియాన్.

ఆ రూల్స్ చూసిన అమ్మాయిలు అట్నుంచి అటే పోతున్నారంట. ఇటీవల ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన అనుభావాలను షేర్ చేశాడు బ్రియాన్‌. ఇందులో భాగంగా... ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని.. లైఫ్ పార్ట్ నర్ దొరటం కష్టంగా ఉందని చెబుతున్నాడు. ముందు సరే అంటారంట... లిస్ట్ చూసాక నాట్ ఇంట్రస్టెడ్ అంటారని వాపోతున్నాడు.

"నాకు ముడుచుకొని పడుకోవడం అలవాటు. మరి లైఫ్ పార్టనర్ తో ఉన్నప్పుడు అలా ఉండలేం కదా. రోజుకు 111 మాత్రలు వేసుకుంటా" అని చెబుతూ అసాధారణ జీవనశైలి కారణంగా శృంగార సంబంధాలను ఏర్పరచుకోవడం కష్టంగా ఉందని వాపోతున్నాడంట బ్రియాన్ జాన్సన్!