తాగి వచ్చిన వరుడు.. వధువు తల్లి మాటే శాసనం అయిన వేళ..!
వరుడు తాగి వచ్చి గొడవ చేయడంతో బెంగళూరులోని ఓ పెళ్లి వేడుక నాటకీయ మలుపు తిరిగింది. తాగి వచ్చిన వరుడు పూర్తిగా సృహతప్పి, విజ్ఞత మరిచి ప్రవర్తించడం.. తాళిని కూడా విసరడం వంటివి చేశాడు!
By: Tupaki Desk | 14 Jan 2025 9:30 AM GMTపెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటారు. ఈ బంధం అద్భుతమైన పంటగా మారకపోయినా పర్లేదు కానీ.. మంట మాత్రం పెట్టకూడదని, మంటగా మారి జీవితాలను తగులబెట్టకూడదని అంటారు. ఈ సమయంలో... తాజాగా జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో స్వయంగా పెళ్లి కొడుకే తాగి వచ్చి, రచ్చ చేయడంతో వధువు తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... వరుడు తాగి వచ్చి గొడవ చేయడంతో బెంగళూరులోని ఓ పెళ్లి వేడుక నాటకీయ మలుపు తిరిగింది. తాగి వచ్చిన వరుడు పూర్తిగా సృహతప్పి, విజ్ఞత మరిచి ప్రవర్తించడం.. తాళిని కూడా విసరడం వంటివి చేశాడు! దీంతో... వధువు కుటుంబం జోక్యం చేసుకుంది.. అతడి ప్రవర్తనపై వారించింది. ఈ సమయంలో వధువు తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా... వధువు తల్లి ఆ పెళ్లి కుమారుడిని, అతని కుటుంబాన్ని వేదిక నుంచి బయటకు వెళ్లమని బలంగా కోరింది. దీంతో... బంధువులు చాలా మంది ఆమెను కాస్త కూల్ చేయడానికి, పెళ్లి కొనసాగించడానికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. వధువు తల్లి అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా నిలబడింది.
పెళ్లిలోనే అతడి ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటే.. ఇక తన కుమార్తె భవిష్యత్తు ఏమవుతుంది అంటూ తనను ఒప్పించడానికి ప్రయత్నించే వారిని అడిగింది. ఈ సమయంలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో.. ఆమె నిర్ణయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
ఈ సందర్భంగా వధువు తల్ల్లి తన కుమార్తెను జీవితకాల కష్టాల నుంచి రక్షించుకుందని కొంతమంది స్పందిస్తుంటే... సంవత్సరాల పశ్చాత్తాపం కంటే కొన్ని గంటల ఇబ్బంది ఉత్తమం అని మరికొంతమంది స్పందించారు. ఏది ఏమైనా... వధువు తల్లి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు నెటిజన్లు.