Begin typing your search above and press return to search.

వరుడికి అంచనాలకు అందని షాకిచ్చిన వధువు & ఫ్యామిలీ!

ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు.. ప్రేమ, పెళ్లి పేరు చెప్పి పురుషులకు ఇస్తున్న షాకులు పలురకములుగా ఉంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 July 2024 6:24 AM GMT
వరుడికి అంచనాలకు అందని షాకిచ్చిన వధువు & ఫ్యామిలీ!
X

ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు.. ప్రేమ, పెళ్లి పేరు చెప్పి పురుషులకు ఇస్తున్న షాకులు పలురకములుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం కాస్త రొటీన్ కి భిన్నంగా ఉంటుంది.. అంచనాలకు ఏమాత్రం అందకుండా ఉంటుందనే చెప్పాలి! పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకున్న అనంతరం.. తన ఇంటి నుంచి బయలుదేరిన వరుడికి తగిలిన షాక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... కాసేపట్లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోతున్నానన్న సంతోషంలో ఉన్న ఓ యువకుడికి ఊహించని షాక్ తలిగింది. దీంతో... చేసేదేమీ లేక, ఏమి చేయాలో పాలుపోక, ఆ షాక్ నుంచి కాస్త తేరుకుని, స్థిమిత పడిన తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పనిలో ఉన్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని లక్నో కి చెందిన యువకుడికి చండీగఢ్ లోని కాజల్ అనే యువతితో పరిచయం ఏర్పడిందట. అది కాస్తా కాలక్రమంలో ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చిందట. దీంతో.. తమ ప్రేమ విషయం కాజల్ తండ్రికి చెప్పడం.. ఆయన వెంటనే తన అంగీకారాన్ని తెలపడం.. జరిగిపోయాయని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... జూలై 11న వీరి వివాహానికి కాజల్ తండ్రి ముహూర్తం ఫిక్స్ చేసి.. ఆ రోజు వివాహ కార్యక్రమానికి నేరుగా వచ్చేయాలని తన కుమార్తెను ప్రేమించిన అబ్బాయికి చెప్పాడంట. దీంతో... ముహూర్తం రోజు రానే వచ్చింది, ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాననే ఆనందంలో ఉన్న వరుడు.. బంధువులను, స్నేహితులను తీసుకుని ఆ గ్రామానికి బయలుదేరి వెళ్లాడు.

అయితే... అక్కడ కాజల్, అతని తండ్రి ఇచ్చిన ఇల్లు అడ్రస్ దొరకలేదు, ఆ సమీపంలో ఎక్కడా పెళ్లి జరుగుతున్న ఆనవాలూ లేదు, వారు చెప్పిన అడ్రస్ లో ఎలాంటి పెళ్లి మండపమూ లేదు. ఆ సమయంలో కాజల్, ఆమె తండ్రి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల వారిని కాజల్ కుటుంబం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు వరుడు.

ఇలా వారి గురించి వాకబు చేయగా... అలాంటి వారు ఎవరూ లేరని గ్రామస్థులు తెలిపారట. ఇలా తాను ప్రేమించిన అమ్మాయి తండ్రే స్వయంగా చెప్పడంతో అన్ని ఏర్పాట్లూ చేసుకుని ప్రిపేర్ అయ్యి వెళ్లిన వరుడికి దిమ్మతిరిగిపోయిందంట. దీంతో... చేసేదేమీ లేక వరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వధువు, ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారని అంటున్నారు.