Begin typing your search above and press return to search.

బ్రిటన్ సంపన్న హిందూజాలు.. ఇంత దిగజరారా? కుక్క కన్నా హీనంగా!

హిందూజా కుటుంబీకులు ప్రకాష్ హిందూజా, అతని భార్య కమల్, కుమారుడు అజయ్, భార్య నమ్రతలకు ఏళ్ల తరబడి శిక్షలు విధించాలని ప్రాసిక్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 12:30 AM GMT
బ్రిటన్ సంపన్న హిందూజాలు.. ఇంత దిగజరారా? కుక్క కన్నా హీనంగా!
X

ఇప్పుడంటే మన దేశంలో అంబానీ, అదానీ గురించి చెప్పుకొంటున్నాం.. 20 ఏళ్ల కిందట లక్ష్మీమిట్టల్ బ్రిటన్ లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరు. వీరి తర్వాతి వరుసలో ఉన్నవారు హిందూజా కుటుంబం. ఆ దేశంలో వీరి పలుకుబడి అంతా ఇంతా కాదు. వేలకోట్ల ఆస్తులతో విలసిల్లే హిందూజాలు దశాబ్దాల కిందటనే భారత్ నుంచి అక్కడకు వెళ్లి స్థిరపడ్డారు.

గల్ఫ్ షేక్ ల మాదిరిగా ఇప్పటివరకు గల్ఫ్ షేక్ లు విదేశీ కూలీలను పెట్టే చిత్రహింసల గురించి విన్నాం. అలాంటి వివాదంలోనే హిందూజా కుటుంబం కూడా చిక్కుకుంది. వీరికి చెందిన స్విట్జర్లాండ్‌ జెనీవాలో ఉన్న బంగ్లాలో సిబ్బంది శ్రమ దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వారి పాస్‌పోర్టులు తీసుకుని.. రోజులు 15-18 గంటలు పనిచేయించుకుని, 8 డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్ లో చెల్లించినంతే..

భారత్ లో పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువ. విదేశాల్లో అయితే ఇలా కాదు. పనిగంటలకు మించి ఎంత ఎక్కువ పనిచేస్తే రెట్టింపు వరకు చెల్లింపు చేయాల్సి ఉంటంది. కాగా, హిందూజా కుటుంబానికి చెందిన నలుగురిపై స్విట్జర్లాండ్‌లో మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ వివాదంలో సోమవారం కోర్టులో విచారణ జరిగింది.బ్లూమ్‌ బెర్గ్ కథనం ప్రకారం.. హిందూజా కుంటుం పని వారి పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుంది. అనుమతి లేకుండా బయటకు పంపించడం లేదు. పనివారికి భారత్‌ లో ఎంతైతే ఇస్తున్నారో.. స్విస్ లోనూఅక్కడ కూడా అంతే మొత్తం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం హిందూజాల పెంపుడు కుక్క కోసం చేస్తున్న ఖర్చుకంటే తక్కువ అని ప్రాసిక్యూటర్‌ ఆరోపించారు.

మహిళా సిబ్బందికి వారంలో ఏడు రోజులు 15-18 గంటల పని దినానికి ఏడు (7 స్విస్‌ ఫ్రాంక్‌) డాలర్లు ఇస్తున్నారు. హిందూజాలు పెంపుడు జంతువులకు ఏటా పెట్టే ఖర్చు 8,584 స్విస్‌ ఫ్రాంక్‌ లు కావడం గమనార్హం.

హిందూజా కుటుంబీకులు ప్రకాష్ హిందూజా, అతని భార్య కమల్, కుమారుడు అజయ్, భార్య నమ్రతలకు ఏళ్ల తరబడి శిక్షలు విధించాలని ప్రాసిక్యూటర్లు ఒత్తిడి చేస్తున్నారు. ప్రాసిక్యూటర్ వైవ్స్ బెర్టోస్సాకు కోర్టు ఖర్చుల కింద ఒక మిలియన్ స్విస్ ఫ్రాంక్‌ లు, సిబ్బందికి నష్టపరిహారం కోసం 3.5 మిలియన్ ఫ్రాంక్‌ లు చెల్లించాలని ప్రాసిక్యూటర్లు డిమాండ్‌ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

అయితే, సిబ్బందిని శ్రమ దోపిడీ చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను హిందూజా కుటుంబ న్యాయవాది తోసిపుచ్చారు. సిబ్బంది నియామకం, రోజువారీ నిర్వహణలో హిందూజాల ప్రమేయం లేదని చెప్పారు.

20 బిలియన్ల నికర విలువ హిందూజా కుటుంబ నికర సంపద 20 బిలియన్లు. లండన్ లో రియల్ ఎస్టేట్‌, షిప్పింగ్, బ్యాంకింగ్, మీడియా, ఇతర రంగాల్లో కార్యకాలాపాలు నిర్వహిస్తోంది.