Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆరెస్స్ ఎందుకు దూరం?

అవును... అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచీ బీఆరెస్స్ పరిస్థితి రకరకాలుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2025 7:01 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికలకు  బీఆరెస్స్  ఎందుకు దూరం?
X

రెండు దఫాలు వరుసగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ.. అసలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి తామే కారణం అని చెప్పే పార్టీ.. అలాంటి పార్టీ ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి బీఆరెస్స్ కు ఎలాంటి పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచీ బీఆరెస్స్ పరిస్థితి రకరకాలుగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... బీఆరెస్స్ పార్టీ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే కథనాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 2001లో స్థాపించబడిన ఈ తర్వాత టీఆరెస్స్ / బీఆరెస్స్ తొలిసారిగా మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెబుతున్నారు. అయితే... అందుకు గల ప్రధాన కారణం ఏమిటనేది ఆసక్తిగా మారింది.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలను కవర్ చేస్తాయి. ఈ సమయంలో ఇలాంటి కీలక జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో రిజల్ట్ అటో ఇటో అయితే అది క్యాడర్ ను మరింత ప్రభావితం చేస్తుందని బీఆరెస్స్ అధినాయకత్వం భావిస్తుందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

కారణం ఏదైనప్పటికీ.. ఆ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆరెస్స్ నిర్ణయించిందనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరోపక్క బీఆరెస్స్ పోటీ చేయకపోవడంపై పొలిటికల్ కామెంట్స్ పీక్స్ కి చేరుతున్నాయి. ఇందులో భాగంగా.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నందుకే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆరెస్స్ తన అభ్యర్థులను నిలబెట్టకూడదని నిర్ణయించుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓడిపోతామని తెలిసే బీఆరెస్స్ ఈ జాగ్రత్త చర్యలు అని ఆయన అన్నారు.