Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఒక్కటైన బీఆర్ఎస్, కాంగ్రెస్!

దళిత నాయకుడు అయిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు రాజకీయాలపై మంచి పట్టు ఉంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:09 PM IST
అసెంబ్లీలో ఒక్కటైన బీఆర్ఎస్, కాంగ్రెస్!
X

శాసన సభను నడపడంలో స్పీకర్ పాత్ర ఘననీయమైనది. అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షంను సమానంగా చూస్తూ ఇరు వైపులా అవకాశాలు ఇస్తూ సభను శాంతియుతంగా నడపాలి. నిజం చెప్పాలంటే స్పీకర్ పదవి కత్తి మీద సాములాంటిది ప్రభుత్వం నుంచి ఎన్నికైనా.. ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్పీకర్ గా ప్రభుత్వం పార్టీకి చెందిన నాయకుడే ఉంటాడు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హయాంలో స్పీకర్ గా దళిత నాయకుడు గడ్డ ప్రసాద్ కుమార్ కు అవకాశం కల్పించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా కలిసి వచ్చింది.

దళిత నాయకుడు అయిన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు రాజకీయాలపై మంచి పట్టు ఉంది. సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. మృదు స్వభావి, సౌమ్యుడిగా గుర్తింపు సంపదించుకున్నారు ప్రసాద్ కుమార్. ఆయనే స్పీకర్ అని వస్తున్న వార్తలను బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డుకోలేదు. ప్రొటెం స్పీకర్ విషయంలో మాత్రం బీజేపీ గుర్రుగా ఉంది. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం నేత అక్బరొద్దీన్ ఒవైసీని నియమించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన ఎదుట ప్రమాణ స్వీకారం చేయలేదు.

స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఈ రోజు (డిసెంబర్ 13) నామినేషన్ వేయనున్నారు. ఆయన ఎంపిక లాంచనమే కానున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

శాసన సభను నడపగలడా..?

2008లో సమీప టీడీపీ ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొంది శాసన సభలో కాలు మోపాడు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో టెక్స్ టైల్స్ శాఖ మంత్రిగా పని చేశాడు. తక్కువ కాలం పని చేసినా ఆయా శాఖ పనితీరుపై పట్టు పెంచుకున్నాడు. గడ్డం ప్రసాద్ విలక్షణమైన నేత. వివాద రహితుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రసాద్ కుమార్ జననేతగా కీర్తిని దక్కించుకున్నాడు. శాసన సభను నడపడంలో ఆయన తన మార్కును చూపెట్టగలరని భావించి సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు గడ్డం ప్రసాద్ కుమార్ శాసన సభ స్పీకర్ గా గవర్నర్ తమిళి సై ఎదుట ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.