Begin typing your search above and press return to search.

‘ఆ కంపెనీ రేవంత్ రెడ్డి తమ్ముడిదే’!... బీఆరెస్స్ బిగ్ ఇష్యూ!

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Aug 2024 7:00 AM GMT
‘ఆ కంపెనీ రేవంత్  రెడ్డి తమ్ముడిదే’!... బీఆరెస్స్  బిగ్  ఇష్యూ!
X

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా రేవంత్ & కో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో "స్వచ్ఛ్ బయో" అనే కంపెనీతో తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలతో బయో ఫ్యుయెల్స్ ఫ్లాంటును ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిందనే విషయంపై బీఆరెస్స్ బిగ్ డౌట్ లేవనెత్తింది! ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అవును... తెలంగాణలో రూ.1000 కోట్లతో బయో ఫ్యుయెల్స్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు "స్వచ్ఛ్ బయో" అనే కంపెనీ ముందుకు వచ్చింది.. ఈ మేరకు న్యూయార్క్ లో జరిగిన చర్చల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ చైర్మన్ ప్రవీణ్ పరిపాటి ఎంవోయూ చేసుకున్నారు! ఇందులో భాగంగా తొలిదశలో సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మించనున్నారు.

ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల సుమారు 250 మందికి ప్రత్యక్షంగానూ, 250 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ "స్వచ్ఛ్ బయో" కంపెనీతో ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీఆరెస్స్ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. అసలు ఈ పేరుతో కంపెనీయే లేదనేది ఈ సందర్భంగా పలువురు లేవనెత్తుతున్న ప్రశ్న.

స్వచ్ఛ్ బయో అనే కంపెనీకి సంబంధించిన వెబ్ సైట్ కానీ, సోషల్ మీడియా అకౌంట్ కానీ లేకపోవడంతో పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు! అసలు ఈ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఎలాంటి కంపెనీ నమోదు కాలేదని, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా దీని వివరాలూ లభ్యం కాలేదని చెబుతున్నారు.

అయితే ఈ స్వచ్ఛ బయోకు సుమారు దగ్గరగా "స్వచ్ఛ్ బయోగ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్" పేరుతో ఓ కంపెనీ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కంపెనీని 2024 జూలై 21న హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్ చేశారని.. ఈ కంపెనీకి సీఎం రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి ఎనుముల, వేదపల్లి శివానందరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక దీని షేర్ క్యాపిటల్ రూ.10 లక్షలని అంటున్నారు.

ఈ వ్యవహారంపై బీఆరెస్స్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా... "స్వచ్ఛ్ బయో రేవంత్ అన్న అనుమల జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కంపెనీ కేవలం 15 రోజుల క్రితమే మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి" అని కోరింది.