Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఎఫెక్ట్ : వైసీపీలో ఆ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ ..?

వైసీపీకి ఒక మంచి అవకాశంగా దీన్ని చూస్తున్నారు కొందరు. ఎలాగంటే పొరుగున ఉన్న తెలంగాణా ఎన్నికల్లో అధికార బీఆర్ ఎస్ పార్టీ ఓటమిని మూటకట్టుకుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 11:41 AM GMT
బీఆర్ఎస్ ఎఫెక్ట్ : వైసీపీలో ఆ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ ..?
X

వైసీపీకి ఒక మంచి అవకాశంగా దీన్ని చూస్తున్నారు కొందరు. ఎలాగంటే పొరుగున ఉన్న తెలంగాణా ఎన్నికల్లో అధికార బీఆర్ ఎస్ పార్టీ ఓటమిని మూటకట్టుకుంది. దానికి దారి తీసిన కారణాలు ఏంటి అన్నది ఇపుడు ఆ పార్టీ శోధిస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీలూ గమనిస్తున్నాయి. ప్రత్యేకించి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా బీఆర్ఎస్ ఓటమికి ఏఏ అంశాలు కారణం అయ్యాయని విశ్లేషించుకుంటోంది.

ముఖ్యంగా చూస్తే జనాలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది అన్నది అందరి మాటగా ఉంది. దాంతో ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలకు వెళ్లబోతున్న వైసీపీ దీన్ని ఒక హెచ్చరికగా తీసుకుంటోంది అని అంటున్నారు. జనంలో బలం లేని వారికి ప్రజా వ్యతిరేకత విపరీతంగా మూటకట్టుకున్న వారికి టికెట్లు ఇస్తే ఓటమి తధ్యం అన్నది బీఆర్ఎస్ అనుభవం చెబుతోంది.

దాంతో వైసీపీ అధినాయకత్వం జాగ్రత్త అప్డుతఒంది అని అంటున్నారు. జగన్ ఈ విషయంలో ఒకింత సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని కచ్చితమైన ఆలోచనతో ఉన్న జగన్ ఎటువంటి చిన్న తప్పూ చేయకుండా అభ్యర్ధుల ఎంపిక ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు అని అంటున్నారు.

ఇప్పటికే పార్టీలో దాదాపుగా ముప్పయి మంది దాకా ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చాయి. అనేక దఫాలుగా ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించిన జగన్ వారికి ఎప్పటికపుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. పనితీరు మెరుగుపడకపోతే తానేమీ చేయలేనని కూడా ఆయన చెప్పి ఉన్నారు. ఇపుడు ఎటూ ఎన్నికలు దగ్గరలోకి వచ్చేశాయి. దాంతో ఎంతలా ప్రయత్నించినా కూడా వ్యతిరేకత అయితే పోదు అని అంటున్నారు.

దాంతో ఆయా చోట్ల కొత్త ముఖాలకు చాన్స్ ఇవ్వడమే బెటర్ అని ఇపుడు జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. లేకపోతే కోరి ఇబ్బందులు వస్తాయని ఆయన భావిస్తున్నారు అంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. అదే విధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక కార్యక్రమాలను ముందుకు తెస్తోంది.

అయినా సరే విపక్షాలు గట్టిగానే ప్రభుత్వం మీద పోరాడుతున్నాయి. అయిదేళ్ల పాటు పాలించిన ఒక ప్రభుత్వం మీద కచ్చితంగానే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇక్ క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు కూడా దీని మీద ప్రభావం చూపిస్తే తట్టుకోలేమన్న భావన అయితే ఉంది. అందుకే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే తెప్పించిన వివిధ రకాలైన సర్వేలను అధ్యయనం చేసిన మీదట జగన్ వారి ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇస్తారని అంటున్నారు.

అదే సమయంలో వారిని బుజ్జగించడం ద్వారా వేరే అవకాశాలు ఇస్తమని చెప్పడం ద్వారా పార్టీలో కొనసాగేట్టు చేసుకోవాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ఎంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఈసారి దక్కవు అన్నది పెద్ద ఎత్తున చర్చగా ఉంది. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. అందులో నుంచి నలుగురిని పార్టీ సస్పెండ్ చేసింది. మిగిలిన 146 మందిలో గెలుపు గుర్రాలు ఎంత మంది అన్నది కూడా ఒకటికి పదిసార్లు కసరత్తు చేసి టికెట్లు ఇస్తుందని అంటున్నారు.

అదే సమయంలో టికెట్లు రానివారు ఇతర పార్టీలలఒకి వెళ్ళిపోకూండా చూసుకోవాల్సిన అనివార్యత కూడా ఉంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతాయి. అందువల్ల కనీసం అయిదారు వేల ఓట్లు ప్రభావితం చేసే నాయకులు పార్టీని వీడినా ఇబ్బందే అని కూడా అంటున్నారు. మొత్తానికి బీఆర్ ఎస్ ఓటమి ఎఫెక్ట్ వైసీపీ మీద పెద్ద ఎత్తున పడుతోంది అని అంటున్నారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయని అంటున్నారు. ఎవరికి టికెట్ రాదు అన్నది కూడా చర్చ అయితే సాగుతోంది.

మరో వైపు టీడీపీకి కూడా తెలంగాణా ఫలితాలు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లే అంటున్నారు. ఆ పార్టీ కూడా గెలుపు గుర్రాలను చూసుకుని పోటీకి దించకపోతే ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. మరి చంద్రబాబు టికెట్లు ఇవ్వబోమని గట్టిగా చెప్పగలరా అన్నదే ఇక్కడ పాయింట్ అంటున్నారు.