పాపం కెసిఆర్...అభ్యర్థులను మార్చక తప్పదా?
దాదాపు నెలన్నర క్రితం కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్ధుల్లో మార్పులు చేయకతప్పదని అనిపిస్తోంది
By: Tupaki Desk | 20 Sep 2023 6:36 AM GMTదాదాపు నెలన్నర క్రితం కేసీఆర్ ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్ధుల్లో మార్పులు చేయకతప్పదని అనిపిస్తోంది. మిగిలిన పార్టీల కన్నా ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే ఉపయోగం ఉంటుందన్నది కేసీయార్ ఆలోచన. నిజంగా కేసీఆర్ ఆలోచన ఒకరకంగా కరెక్టే అనడంలో సందేహం లేదు. అయితే మొదటి జాబితా ప్రకటించిన తర్వాత జాతీయ రాజకీయాల్లో సడెన్ గా మార్పులు జరిగిపోతున్నాయి. దాని ప్రభావం తెలంగాణాలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ మీద కూడా పడుతోంది.
విషయం ఏమిటంటే పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేట్లే ఉంది. ఇదిగనుక పాస్ అయితే పార్లమెంటుతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్నీ రాష్ట్రాలు 33 శాతం మహిళలకు కచ్చితంగా టికెట్లు ఇచ్చి తీరాల్సిందే. కాకపోతే ఈ తీర్మానం తక్షణమే అటే జరగబోయే ప్రతి ఎన్నికల నుండి రాదని తేలిపోయింది. బిల్లు చట్టమైన తర్వాత 2029 న సార్వత్రిక ఎన్నికల నుండి అమల్లోకి వస్తుంది.
2024 ఎన్నికల నుండి వర్తించకపోయినా బిల్లు చట్టంగా మారగానే వెంటనే మహిళా నేతలైతే టికెట్లు డిమాండ్ చేస్తారు. అంటే 2024 సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లోపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలోను మహిళలకు రిజర్వేషన్ వర్తింపచేయాల్సుంటుంది. లేకపోతే మహిళల ఓట్లు పార్టీలకు పడేది అనుమానమే. అందుకనే కేసీయార్ మొదటిజాబితాలో మార్పులు తప్పేట్లు లేదు. ఇక రెండో కారణం ఏమిటంటే చాలామంది సిట్టింగులపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. వ్యతిరేకత మామూలు జనాల్లోనే కాకుండా పార్టీ నేతలు, క్యాడర్లో కూడా పెరిగిపోతోంది.
దీన్ని నిశితంగా గమనిస్తున్న కేసీయార్ పై రెండు కారణాలను చూపించి మొదటిజాబితాను రద్దుచేసినా ఆశ్చర్యపోక్కర్లేదని పార్టీలోనే టాక్ వినబడుతోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే మొదటిజాబితాను రద్దుచేస్తే సిట్టింగుల్లో కేసీయార్ పై వ్యతిరేకత పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళల్లో ఎంతమంది కేసీయార్ పై తిరుగుబాటు చేస్తారో తెలీదు. ఇక మార్పులు చేయకపోతే మహిళలు, పార్టీలో నేతలు, క్యాడర్ ఎంతమంది సిట్టింగులకు వ్యతిరేకంగ పనిచేస్తారో తెలీదు. మొత్తంమీద జాబితాలో అయితే మార్పులు తప్పవనే అనుకుంటున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.