Begin typing your search above and press return to search.

బీయారెస్ ని మోయాల్సింది ఆ ఇద్దరేనా...?

ఆయన వైరల్ ఫీవర్ తో ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. అది కాస్తా చాతీ ఇన్ఫెక్షన్ గా మారింది. మరిన్నాళ్ళు కేసీయార్ విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు

By:  Tupaki Desk   |   9 Oct 2023 3:53 AM GMT
బీయారెస్ ని మోయాల్సింది ఆ ఇద్దరేనా...?
X

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా కీలకంగా ఆసక్తికరంగా మారబోతున్నాయి. రెండు సార్లు వరసగా అధికారంలోకి వచ్చిన బీయారెస్ ఈసారి గెలిస్తే సౌతిండియాలోనే కొత్త రికార్డును నమోదు చేస్తుంది. అంటే వరసగా మూడవసారి అధికారాన్ని చేపట్టడం అన్న మాట. ఈ ఫీట్ ని ఎన్టీయార్, ఎమ్జీయార్ జయలలిత కరుణా నిధి లాంటి వారు కూడా చేయలేకపోయారు.ఈ రేర్ ఫీట్ ని బీయారెస్ అధినేత సాధించాలనుకుంటున్నారు. దాదాపుగా నెల క్రితమే ఆయన పార్టీ అభ్యర్ధులను ప్రకటించేశారు. అందరి కంటే ముందుగానే తమ పార్టీ అభ్యర్ధులను జనంలో ఉంచగలిగారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీయార్ మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఆయన వైరల్ ఫీవర్ తో ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. అది కాస్తా చాతీ ఇన్ఫెక్షన్ గా మారింది. మరిన్నాళ్ళు కేసీయార్ విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. దాంతో బీయారెస్ కి ఇపుడు అసలైన ఇబ్బంది ఏర్పడింది. బీయారెస్ నిజానికి చాలా ముందుగా జనంలోకి పోవాలనుకుంది. మాటల మాంత్రికుడు కేసీయార్ ప్రతీ జిల్లాలో ఒక మీటింగ్ వంతున పెట్టాలని ప్లాన్ చేశారు.

అలా కేసీయార్ దూకుడు చేస్తే ముచ్చటగా మూడవసారి అధికారం తధ్యమని కూడా ఆలోచించారు. కానీ సరైన టైం లో కేసీయార్ అనారోగ్యం బారిన పడ్డారు. ఇక బీయారెస్ పరిస్థితి చూస్తే తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ పాలనతో యాంటీ ఇంకెంబెన్సీ చాలా పెరిగింది. అదే టైం లో అనూహ్యంగా కాంగ్రెస్ బలపడింది. ఈసారి కాంగ్రెస్ కి చాన్సెస్ ఉన్నాయని అంతా అంటున్న నేపధ్యం ఉంది.

ఇలాంటి టైం లో తిమ్మిని బమ్మిగా చేయగల కెపాసిటీ ఉన్న గులాబీ బాస్ బయటకు రాకపోతే ఎట్లా అని బీయారెస్ శ్రేణులు అంటున్నారు. మొత్తానికి పార్టీ శ్రేణులు డీలా పడుతున్నాయి. ఈ క్రమంలో నుంచి చూస్తే బీయారెస్ ప్రచార బాధ్యతలు మొత్తం కొడుకు కేటీయార్ మీద అలాగే మేనల్లుడు హరీష్ రావు మీద పడ్డాయని అంటున్నారు.

ఈ ఇద్దరూ కూడా మాటకారులే, వ్యూహకర్తలే కానీ కేసీయార్ ఉంటే ఆ లెక్కే వేరు అన్న చర్చ అయితే ఉంది. ప్రత్యర్ధి పార్టీలు సమరానికి సై అంటున్న వేళ కేసీయార్ జనంలోకి రాకపోవడం లేకపోవడం గులాబీ పార్టీకి అతి పెద్ద లోటు అంటున్నారు. మరి కేసీయార్ వచ్చేంతవరకూ రంగంలోకి దూకేంతవరకూ హరీష్ కేటీయార్ ఇద్దరూ బీయారెస్ బాధ్యతలను మోయాల్సిందే అంటున్నారు.

సరిగ్గా ఇలాంటి టైం లోనే కేటీయార్ తన టాలెంట్ ఇంకా రుజువు చేసుకుంటే సీఎం చెయిర్ కి దగ్గర అవుతారు అని అంటున్నా వారూ ఉన్నారు. ఏది ఏమైనా కేసీయార్ ఉంటేనే ఆ కిక్కే వేరబ్బా అన్న చర్చ అయితే నడుతోంది. మరి పెద్దాయన వచ్చేది ఎపుడు అన్నదే బీయారెస్ లో చర్చగా ఉంది.