Begin typing your search above and press return to search.

మానసికంగా బీయారెస్ ప్రిపేర్ అవుతోందా...?

ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో బీయారెస్ టోటల్ శ్రేణులను గెలుపు వైపుగా నడిపించాల్సిన బాధ్యత కేసీయార్ సహా అగ్ర నేతల మీద ఉంది

By:  Tupaki Desk   |   27 Oct 2023 11:11 AM GMT
మానసికంగా  బీయారెస్ ప్రిపేర్ అవుతోందా...?
X

తెలంగాణా ఎన్నికలు వాడిగా వేడిగా సాగుతున్నాయి. రాజు ఎవరు అన్నది జనం తీర్పు చెబుతారు. అయితే జనం నాడిని పట్టడంలో అనేక రకాలైన సర్వేలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని జనంలోకి వదులుతున్నారు. ఓవరాల్ గా పిక్చర్ అయితే బీయారెస్ కి టఫ్ ఫైటింగ్ అనే చెబుతోంది.

ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో బీయారెస్ టోటల్ శ్రేణులను గెలుపు వైపుగా నడిపించాల్సిన బాధ్యత కేసీయార్ సహా అగ్ర నేతల మీద ఉంది. అయితే కేసీయార్ వ్యూహాత్మకంగా అన్నారా లేక సడెన్ గా మాట వాడేశారా అన్నది పక్కన పెడితే మేము ఓడితే ఇంట్లో కూర్చుంటాం, రెస్ట్ తీసుకుంటామన్న మాటలు మాత్రం పూర్తిగా బూమరాంగ్ అయ్యాయనే అంటున్నారు.

అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఓటమి అన్న మాట రాకూడదు, అంతర్గత చర్చలలో సైతం ఆ పదానికి తావివ్వకూడదు. అలాంటిది కేసీయార్ లాంటి అగ్ర నాయకుడే ఓడితే అంటూ బహిరంగ సభలలో మాట్లాడడం వల్ల బీయారెస్ టోటల్ గా డీ మోరలైజ్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఇప్పటిదాక సెంచరీ మాదే గెలిచి చూపిస్తామంటూ చెప్పిన బీయారెస్ అధినేతలు ఇపుడు ఓడినా పోయేది ఏమీ లేదు అంటున్నారు అంటే బీయారెస్ గుమ్మం దాకా ఓటమి వచ్చేసిందా అన్న చర్చ మొదలైంది.

సర్వేలు అంతర్గత నివేదికలలో బీయారెస్ కి రెడ్ సిగ్నల్స్ కనిపించాయా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో జోష్ హుషార్ ఎన్నడూ చూడని విధంగా కనిపిస్తోంది. బీయారెస్ మాత్రం రొటీన్ గా అలా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

పదేళ్ళ పాటు దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీ తన ప్రచారాన్ని రొటీన్ గా చేయడమే ఒక మైనస్. ఇక కేసీయార్ స్పీచులలో కూడా వాడి వేడి కనిపించడంలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎంతసేపూ మేము వస్తేనే తెలంగాణా, మేము ఉంటేనే రాష్ట్రం అనేట్లుగా మాట్లాడడం తప్పించి కొత్త మాట రావడంలేదు అని అంటున్నారు.

బీయారెస్ పాలన జనాలు చూసారు. ప్రతీ అయిదేళ్ళకు కొత్త ఓటర్లు జాయిన్ అవుతూ ఉంటారు. వారిని కూడా ఆకట్టుకోవాల్సి ఉంది. అదే టైం లో యాంటీ ఇంకెంబెన్సీని దాటి ముందుకు సాగే మహా మంత్రం ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ దగ్గరా లేదనే చెప్పాలి. ప్రజలు ఎలాంటి వారు అంటే ఎంత చేసినా కూడా కొత్తదనం వైపు చూస్తారు.

అలా ఇపుడు బీయారెస్ కి స్ట్రాంగ్ ఆల్టర్నేషన్ గా కాంగ్రెస్ నిలిచింది. దాంతో ప్రజలు ఆ వైపునకు మొగ్గు చూపడంలో ఆశ్చర్యం అయితే లేదు. కొత్త మోజు అన్నది తెలిసిందే. పైగా ఈసారి కాంగ్రెస్ కి చాన్స్ ఇస్తే ఏమి చేస్తుంది అన్న ఉత్కంఠ కూడా ఉంటుంది. అక్కడ రేవంత్ రెడ్డి లాంటి కొత్త నాయకులు ఉన్నారు.

ఈ పరిణామాలతోనే జనం మొగ్గు బీయారెస్ కి తగ్గుతోందా అన్నది ఒక చర్చ. సరే బీయారెస్ అధికారంలో ఉంది కాబట్టి నిందలూ నిష్టూరాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అధికార పార్టీ గెలుపు కోసం చేసే ప్రయత్నాలు కానీ ఎత్తులు వ్యూహాలు కానీ బేలగా డీలాగా ఉండకూడదు అని అంటారు. 2019 ఎన్నికల వేళ ఏపీలో చంద్రబాబు చాలా సభలలో ఏకంగా మూడు ముప్పాతిక భాగం శరీరం అంతా వంగి వంగి దండాలు పెట్టుకుంటూ పోయారు. ఆ బాడీ లాంగ్వేజ్ ని చూసిన వారు అంతా టీడీపీ ముందుగానే ఓటమి మీద సంకేతాలు ఇచ్చేసింది అని అనుకున్నారు.

చివరికి అదే నిజం అయింది. ఇపుడు కేసీయార్ లాంటి రాజకీయ వ్యూహకర్త సైతం తన నోట ఓటమి మాట పలకడం ద్వారా బీయారెస్ ఓ ప్రకంపనలు పుట్టించారు అని అంటున్నారు. ఇది తటస్థ ఓటర్ల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇప్పటిదాకా ఉన్న డౌట్లూ కానీ సంశయాలు కానీ పక్కలు పోయి వారు ఒక క్లారిటీతో నిర్ణయం తీసుకునేలా చేస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా మానసికంగా ఓటమిని బీయారెస్ ప్రిపేర్ అవుతోందా అన్నదే ఇక్కడ పాయింట్ అని అంటున్నారు. ఇక మీదట మరే సభలోనూ కేసీయార్ ఓటమి మాట ఎత్తకపోతే బెటర్ అని కూడా సొంత పార్టీలో వినిపిస్తోంది మరి.