"పువ్వాడ పువ్వే కానీ"... తుమ్మల కామెంట్స్ పీక్స్!
అవును... ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులపై బీఆరెస్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ముందుకుపోతుంది
By: Tupaki Desk | 7 Nov 2023 1:25 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మరింత రక్తికడుతున్నాయి! ఇక్కడ బీఆరెస్స్ నేతలకు, కాంగ్రెస్ నేతలకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరిముఖ్యంగా పువ్వాడ అజయ్ - తుమ్మల నాగేశ్వర రావుల మద్య మాటల యుద్దాలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యల అనంతరం తుమ్మల దూకుడు మరింత పెరిగింది.
అవును... ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావులపై బీఆరెస్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ముందుకుపోతుంది. బీఅరెస్స్ నుంచి బయటకు వచ్చిన సమయంలో... ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆరెస్స్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనే స్థాయిలో పొంగులేటి ఫైరయ్యారు. అనంతరం తుమ్మల నాగేశ్వర రావు కారు దిగిపోయారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కి ఈ ఇద్దరు నేతలకూ మామూలుగా ఉండటం లేదు.
ఈ క్రమమో తాజాగా ఖమ్మం సభలో తుమ్మల నాగేశ్వర రావుపై సీఎం కేసీఆర్ పరోక్షంగా కీలక కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా... "తుమ్ములు, తుప్పలను నమ్మకండి. తుమ్మకు ముళ్లుంటయి. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ.. పువ్వాడ పువ్వులాంటోడు. మంచి సువాసన వస్తుంది. ఆయనను నమ్మండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు" అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దీంతో... ఇదే టైంపులో తుమ్మల నాగేశ్వర రావు రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... "ఔను.. పువ్వాడ పువ్వే కానీ, పూజకు పనికిరాని వయ్యారి భామ పువ్వు" అని తుమ్మల సెటైర్లు వేశారు. ఇక తుమ్మ చెట్లకు ముళ్లున్నా.. దానిని నాగలి చేసుకుని దున్నుకుంటే బ్రతుకునిస్తుంది. పంటలు పండేలా చేస్తుంది.. అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో... కేసీఆర్, పువ్వాడలకు తుమ్మల ఉమ్మడిగా ఇచ్చిపడేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో పువ్వాడ పార్టీలు ఎప్పుడెప్పుడు మరారు, ఎలా మారారు వంటి విషయాలు చెప్పడం మొదలుపెట్టిన తుమ్మల... ఇది నితా? అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా... పువ్వాడ పువ్వేమీ కాదని, ఆయన కూడా జంపింగ్ జిలానీనేనని వ్యాఖ్యానించారు తుమ్మల. ఈ సందర్భంగా పువ్వాడ ఏయే పార్టీలు మారారనేది క్లారిటీ ఇచ్చారు.
సుదీర్ఘకాలం కమ్యునిస్టు పార్టీలతో ఉన్న పువ్వాడ కుటుంబం.. అజయ్ హయాంలో ఆ పార్టీకి తూట్లు పొడిచిందని, అనంతరం వైసీపీలో చేరారని అన్నారు. ఈ సందర్భంగా.. ఇది నీతేనా అని ప్రశ్నించారు. ఇక వైసీపీలో చేరిన సమయంలో "చచ్చేంత వరకు జగన్ తోనే" అని చెప్పుకున్న అజయ్... వైసీపీని కూడా వదిలేసి కాంగ్రెస్ పంచన చేరారని గుర్తుచేశారు! అక్కడనుంచి ఇప్పుడు బీఆరెస్స్ కి చేరి తనకు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ పరిణామాలను గుర్తించే తాను పార్టీ మారానని.. రాష్ట్ర విభజన జరిగే వారు తాను తెలుగుదేశంతోనే ఉన్నానని.. ఆ తర్వాతే తనను కేసీఆర్ బతిమిలాడి పార్టీలో చేర్చుకున్నారని తుమ్మల తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ తనను వాడుకుని అవమానించడంవల్లే కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపాడు. పార్టీలు మారే విషయంలో వారు చేస్తే సంసారం పక్కవారు పార్టీ మారితే వ్యభిచారమా? అని నిలదీశారు.
ఏది ఏమైనా... ఖమ్మంలో ఈ దఫా బీఆరెస్స్ వర్సెస్ కాంగ్రెస్ పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు! అందుకే ఈసారి రసవత్తర పోరు జరిగే టాప్ నియోజకవర్గాల్లో ఖమ్మం కూడా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలియాలంటే డిశెంబర్ 3 వరకూ ఆగాల్సిందే!!