Begin typing your search above and press return to search.

ఆ విషయంలో టాప్ ప్లేస్ లో బీఆరెస్స్... ఐదో స్థానంలో వైసీపీ!

దీంతో... నాటి నుంచి బీఆరెస్స్ నేతలు ఒక్కొక్కరూ కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2024 1:30 AM GMT
ఆ విషయంలో టాప్  ప్లేస్  లో బీఆరెస్స్... ఐదో స్థానంలో వైసీపీ!
X

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచీ పదేళ్లపాటు అధికారంలో ఉంది బీఆరెస్స్ (నాటి టీఆరెస్స్) పార్టీ. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితమైంది. దీంతో... నాటి నుంచి బీఆరెస్స్ నేతలు ఒక్కొక్కరూ కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకుంటున్నారు.

దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కూడా తలుపులు బార్లా తెరిచి వెల్ కం చెబుతుందని అంటున్న నేపథ్యంలో... ఇటీవల బీఆరెస్స్ ఎమ్మెల్సీలు అయితే గ్రూపుగా కలిసి వెళ్లి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ కథనాలొస్తున్న వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బీఆరెస్స్ రిచ్చెస్ట్ ప్రాంతీయ పార్టీగా నిలిచింది.

అవును... దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన తాజా రిపోర్టు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... దేశంలోని ప్రాంతీయపార్టీలు అన్నింటికంటే ఎక్కువ ఆదాయం కలిగిన పార్టీ బీఆరెస్స్ అని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది.

ఈ క్రమంలో... 2022 - 23 ఫైనాన్షియల్ ఇయర్ లో బీఆరెస్స్ కు ఏకంగా రూ. 736.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు నివేదించింది. అనంతరం రెండో స్థానంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ రూ.333.45 కోట్ల ఆదాయతో ఉంది. ఇదే క్రమంలో... రూ.214.35 కోట్ల ఆదాయంతో డీఎంకే మూడోస్థానంలో ఉంది.

అదేవిధంగా... రూ.181 కోట్లతో బీజేడీ నాలుగో స్థానంలో ఉండగా.. రూ.74.78 కోట్లతో వైఎస్సార్సీపీ ఐదో స్థానంలో ఉంది. ఇలా మొత్తం 39 ప్రాంతీయ పార్టీలకు రూ.1740.48 కోట్లు సమకూరగా.. అందులో తొలి ఐదుపార్టీలకే రూ.1541.32 కోట్ల ఆదాయం ఉందని రిపోర్ట్ వెల్లడించింది. ప్రధానంగా ఇందులో ఒక్క బీఆరెస్స్ పార్టీ ఆదాయమే రూ.736.67 కోట్లు ఉండటం గమనార్హం.