Begin typing your search above and press return to search.

బీయారెస్ కొంచెం జంకుతోందా...?

సరే ఇదంతా ఓకే అనుకున్నా బీయారెస్ లో ఎక్కడో తెలియని జంకు ఉందా అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 3:30 AM GMT
బీయారెస్ కొంచెం జంకుతోందా...?
X

ముచ్చటగా మూడవసారి అధికారం మాదే అని బీయారెస్ ఒక వైపు జబ్బలు చరుస్తోంది. హ్యాట్రిక్ విజేత కేసీయార్ అని అంటోంది. డిసెంబర్ మూడవ తేదీ మూడవసారి అధికారంలోకి మేమే వస్తున్నామని డేట్ టైం మిక్స్ చేసి మరీ ఫిక్స్ చేస్తోంది. సరే ఇదంతా ఓకే అనుకున్నా బీయారెస్ లో ఎక్కడో తెలియని జంకు ఉందా అని అంటున్నారు.

బీయారెస్ అగ్ర నేతల ప్రకటనలు అధికార ధీమా మీద ఉంటూండగానే మరో వైపు కొంత కలవరపాటు కూడా కనిపిస్తోంది అని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికి వరసగా రెండు సార్లు బీయారెస్ అధికారంలోకి వచ్చింది.

నిజానికి తెలంగాణా సాధించాక బీయారెస్ తొలిసారి గెలవడం ఒక అద్భుతం అయితే రెండవసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం మరో విశేషంగా చెప్పుకోవాలి. తొలిసారి అద్భుతం ఎలా అయింది అంటే బీయారెస్ అప్పటి రూపమైన టీయారెస్ ఉద్యమ పార్టీగానే ఉంది. సంస్థాగతంగా పెద్దగా బలం లేదని అంటూండేవారు.

అప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉంది. టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉంది. దాంతో టీయారెస్ నాడు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందా అని డౌట్లు ఉండేవి కానీ ఆ డౌట్లు అన్నీ కూడా పక్కన పెడుతూ నాడు టీయారెస్ 61 సీట్లతో సింపుల్ మెజారిటీని సాధించి పవర్ లోకి వచ్చింది. ఇక రెండవసారి కూడా మంచి టైం టైమింగ్ చూసుకుని మరీ ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లి విక్టరీ కొట్టింది. గతం కంటే పాతికకు పైగా సీట్లను గెలుచుకుని సత్తా చాటింది.

ఇపుడు చూస్తే మూడవసారి అధికారంలోకి బీయారెస్ రావాలని చూస్తోంది. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయా అన్నదే చర్చగా ఉంది. రెండు సార్లు అధికారంలో ఉండడం వల్ల యాంటీ ఇంకెంబెన్సీ హెచ్చు స్థాయిలో ఉందని ఫలితంగా బీయారెస్ కి అనుకూల ఓటింగ్ అంతగా ఉండదని అంటున్నారు.

అదే విధంగా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది బయటకు అంతలా కనిపించడం లేదు కానీ సైలెంట్ గా అది అండర్ కరెంట్ గా ఉంది అని అంటున్నారు. అలాగే రెండు సార్లు బీయారెస్ కి చాన్స్ ఇచ్చాం కాబట్టి ఈసారి మార్పు కోరుకుందామని ఆలోచించేవారు కూడా ఉంటారని అంటున్నారు. ఆ మార్పు ఆకాంక్ష అన్నది బలంగా ఉందని అంటున్నారు.

దీంతోనే ఇపుడు బీయారెస్ లో కొంత కలవరం బయల్దేరింది అని అంటున్నారు. అందుకే పదే పదే కేసీయార్ నోట ఓటు బ్రహ్మాస్త్రం దాన్ని చక్కగా వాడుకోండి అని సూచన వస్తోంది అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ మీద హరీష్ రావు పదునైన విమర్శలు చేయడం కూడా అందులో భాగమే అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కేటీయార్ సైతం ఇపుడు టీడీపీ ఓట్ల కోసం చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేయడం కూడా అంతా గమనిస్తున్నారు అని అంటున్నారు.

మేము ఎందుకు దిగాలి, ప్రభుత్వం బాగుంది. సాఫీగా సాగుతోంది. అలాంటపుడు మార్పు చేయడం ఎందుకు అన్న కేటీయార్ వాదన వెనక కూడా ఏవో సంకేతాలు బీయారెస్ కి అందినట్లుగా తోస్తోంది అని అంటున్నారు. మొత్తంగా ఇవన్నీ చూసినపుడు మాత్రం బీయారెస్ లో జంకు అనేది ఉందని చాలా సార్లు బయటకు గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నా అంతర్మధనం కూడా తెలియకుండానే కొన్ని సార్లు బయటపడుతోంది అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే సర్వేలను నమ్మకపోవచ్చు, మీడియా వార్తలను పక్కన పెట్టవచ్చు, కానీ జనం మూడ్ ని మాత్రం రాజకీయాలలో ఢక్కమెక్కీలు తిన్న వారు సులువుగానే గమనిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు మాత్రం కచ్చితంగా బీయారెస్ కి గాలి మార్పు ఏదో ఉందని అర్ధమైనట్లు గానే ఉంది అంటున్నారు.

ఇక తెలంగాణాలో దశాబ్దాలకు పైగా ఉద్యమాలు నడిపిన బీయారెస్ అగ్ర నాయకత్వానికి జనం మూడ్ ని పల్స్ ని పట్టుకోవడం కష్టమేమీ కాదని అంటున్నారు. తెలంగాణా ప్రజలు ఎమోషనల్ గా ఉంటారు. వారు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే దాని ప్రభావం ఏ రేంజిలో ఉంటుందో కూడా బీయారెస్ అగ్ర నేతలకు తెలియనిది కాదు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం బయటకు ధీమాగా మాట్లాడుతున్నా జంకు అన్నది లోలోపల మాత్రం బీయారెస్ పెద్దలలో ఉంది అంటున్నారు. చూడాలిమరి జనాలు ఏ రకంగా తీర్పు ఇస్తారో.