Begin typing your search above and press return to search.

రూ. 3000 కోట్ల మేటర్: రేవంత్ బ్రదర్ పై పోస్టు.. బీఆరెస్స్ నేతపై కేసు!

వివరాళ్లోకి వెళ్తే... వారం రోజుల క్రితం బీఆరెస్స్ నాయకుడు క్రిశాంక్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   21 March 2024 4:39 AM GMT
రూ. 3000 కోట్ల మేటర్: రేవంత్  బ్రదర్  పై  పోస్టు.. బీఆరెస్స్  నేతపై కేసు!
X

సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుల ఫలితంగా కేసులు నమోదవ్వడం, కోర్టుల చుట్టూ తిరుగుతుండటం వంటి ఘటనలు ఎన్నో తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా బీఆరెస్స్ పార్టీ నేతకు అలాంటి పరిస్థితే ఎదురైంది. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడిపై ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ఫలితంగా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది! దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.


అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడిపై సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణల ఫలితంగా భారత రాష్ట్ర సమితి (బీఆరెస్స్) నేతపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సదరు బీఆరెస్స్ నేత ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ... "అంత భయమెందుకు అనుముల రేవంత్ రెడ్డి?" అని తిరిగి కామెంట్ చేయడం గమనార్హం!

వివరాళ్లోకి వెళ్తే... వారం రోజుల క్రితం బీఆరెస్స్ నాయకుడు క్రిశాంక్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా "చిత్రపురి సినీ వర్కర్స్ సొసైటీ లో 3000 కోట్ల కుంభకోణంలో కోశాధికారి ఎవరో తెలుసా? సీఎం రేవంత్ సోదరుడు అనుముల మహానంద రెడ్డి" అని పోస్ట్ చేశారు. దీంతో.. ఈ వ్యవహారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈయన ఫిర్యాదు మేరకు క్రిశాంక్ మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదుచేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బీఆరెస్స్ నాయకుడు క్రిశాంకే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగా... 3,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన చిత్రపురి సొసైటీ కోశాధికారిగా ఉన్న రేవంత్‌ రెడ్డి సోదరుడు మహానంద రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు తనపై కేసు నమోదు