Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం

కేసులో అసలు దోషులు తప్పించుకోగా ఏ నేరం చేయని వాడికి శిక్ష పడిందని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   8 Dec 2023 12:43 PM GMT
బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం
X

దేశంలో మనీలాండరింగ్ కేసు ఓ ఊపు ఊపేసింది. ఇందులో కేసీఆర్ కూతురు కవితకు కూడా భాగం ఉన్నట్లు అప్పట్లో మీడియాలో కథనాలు జోరుగా వచ్చాయి. కానీ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కేసు కాస్త పక్కదారి పట్టింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కేసులో అసలు దోషులు తప్పించుకోగా ఏ నేరం చేయని వాడికి శిక్ష పడిందని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి.

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాత్రి రాత్రే ప్రభుత్వం మారిపోవచ్చు. రాత్రికి రాత్రే కేసులు తారుమారు కావచ్చు. అదే మన ప్రజాస్వామ్యం. దీంతో ఈ కేసులో ప్రధానమైన వారు పక్కకు పోగా ఇతరులకు మాత్రం శిక్ష ఖరారు కావడం గమనార్హం. దీంతో జైలు జీవితం అనుభవిస్తున్న సుఖేష్ అప్పటి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను గురించి తీవ్ర ఆరోపణలు చేశాడు.

మీకు అధికారం దూరమవుతుంది. మీ అహంకారమే మిమ్మల్ని దెబ్బ తీస్తుంది. మీ పాలన అంతమవుతుందని చెబుతూ లేఖ రాశాడు. మీరు చేసిన అవినీతికి సమాధానం చెప్పాల్సిన సమయం కూడా వస్తుందని పేర్కొన్నాడు. మీరు చేసిన నేరాలకు మీరు కూడా జైలుకు వస్తారని జోస్యం చెప్పాడు. మీరు రెడీగా ఉండండి. మీకు కూడా కౌంట్ డౌన్ మొదలైందని తెలిపాడు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు సంతోషించాడు. రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపాడు. మీ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించి ప్రజలకు మంచి పథకాలు అందించాలని కోరాడు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి మంచి పని చేశారని కితాబిచ్చారు. వారి ముందుచూపుకు ముచ్చట పడ్డాడు.

తెలంగాణలో అధికార మార్పిడి అనివార్యమని సూచించాడు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోవడంతో ఎన్నో అనర్థాలు జరిగాయన్నాడు. ఈనేపథ్యంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసిన దారుణాలను తలుచుకుని బాధ పడ్డాడు. తనలాంటి వారిని ఎందరినో బలి చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేసుకున్నాడు.