Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ నుంచి అంత మంది ఎమ్మెల్యేలు జంప్ చేయనున్నారా?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు వలస వెళ్తుండటంతో బీఆర్ఎస్ దుకాణం ఇక మూత పడటం ఖాయమంటున్నారు

By:  Tupaki Desk   |   6 April 2024 12:29 PM GMT
బీఆర్ఎస్ నుంచి అంత మంది ఎమ్మెల్యేలు జంప్ చేయనున్నారా?
X

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు వలస వెళ్తుండటంతో బీఆర్ఎస్ దుకాణం ఇక మూత పడటం ఖాయమంటున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంటోంది. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకార ధోరణితోనే నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. పార్టీ దుస్థితికి కేసీఆర్ పరోక్షంగా కారణంగా నిలుస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పరువు గంగలో కలవడం ఖాయమని పేర్కొన్నారు.

క్రిష్ణా జలాల తరలింపులో కూడా కేసీఆర్ ప్రమేయం ఉందని తెలిపారు. అధికారంలో ఉండగా రాష్ట్రం గురించి పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటూ రాద్ధాంతం చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల్లో ఇప్పుడు ఆందోళన పెరుగుతోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు ఇంకా కొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. పార్టీ మారి తమ భవిష్యత్ ను మార్చుకోవాలని చూస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుతోనే గండం మొదలైందంటున్నారు. టీఆర్ఎస్ పేరు కాస్త బీఆర్ఎస్ గా చేయడంతోనే పరిస్థితి మారిందంటున్నారు. చాలా మంది పండితులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఈనేపథ్యంలో మళ్లీ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని చూస్తున్నారని సమాచారం. లేకపోతే పార్టీకి మనుగడ ఉండదని హెచ్చరిస్తున్నారు.