Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ - కాంగ్రెస్ ... ఇద్దరి ఆయుధాలు రెడీ

దానికి కౌంటర్ గా ఈరోజు కేటీయార్ ఆధ్వర్యంలో 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు అదే మేడిగడ్డను సందర్శించబోతున్నారు

By:  Tupaki Desk   |   1 March 2024 6:36 AM GMT
బీఆర్ఎస్ - కాంగ్రెస్ ... ఇద్దరి ఆయుధాలు రెడీ
X

తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల అజెండాలు సెట్ చేసుకున్నట్లున్నాయి. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు తమిష్టమొచ్చినట్లుగా అజెండాలు సెట్ చేసుకున్నాయి. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం తమ అజెండాను స్పష్టంగా రెడీచేసుకున్నాయి. అవేమిటంటే కాంగ్రెస్ ఏమో కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజిల నాసిరకం నిర్మాణాలు, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు ముసుగులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేసీయార్ అండ్ కో పై ఆరోపణలు చేయటం.

ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకమైన సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలైందనే ప్రచారం చేయాలన్న అజెండాను బీఆర్ఎస్ అజెండాను సెట్ చేసుకున్నది. అంటే కాంగ్రెస్ ప్రధాన అజెండా కేసీయార్ హయాంలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల దోపిడిపైనే. బీఆర్ఎస్ అజెండా ఏమో గ్యారేంటీల అమలు ఫెయిల్యూర్లపైనే అని అర్ధమైపోతోంది. రెండుపార్టీలు కూడా తమ అజెండాలకు అనుగుణంగానే బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. అందుకనే మేడిగడ్డ బ్యారేజి దగ్గరకు పోటీపడి మరీ సందర్శన చేస్తుండటం.

తమ అజెండాలతో ప్రత్యర్ధి పార్టీలను ఎంత వీలుంటే అంతగా గబ్బుపట్టించటమే సింగిల్ పాయింట్ అజెండాగా రెండు పార్టీలు డిసైడ్ అయిపోయాయి. ఆ మధ్య రేవంత్ ఆధ్వర్యంలో మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు మేడిగడ్డబ్యారేజీని సందర్శించిన విషయం తెలిసిందే. ఆ సందర్శనలో కేసీయార్ దోపిడీపై రేవంత్, మంత్రులు పదేపదే ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీలు సాగునీటి ప్రాజెక్టులుగా పనికిరావని మంత్రులు తేల్చేశారు.

దానికి కౌంటర్ గా ఈరోజు కేటీయార్ ఆధ్వర్యంలో 200 మంది నేతలు, ఇంజనీరింగ్ నిపుణులు అదే మేడిగడ్డను సందర్శించబోతున్నారు. వీళ్ళు డెఫినెట్ గా ప్రాజెక్టుల నిర్మాణాన్ని సమర్ధంచుకుంటు మాట్లాడుతారనటంలో సందేహంలేదు. ఇదే సమయంలో ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగటం ఖాయం. అలాగే పనిలోపనిగా సిక్స్ గ్యారెంటీస్ లోపాలపైన కూడా గొంతెత్తుతారు. మధ్యలో బీజేపీ ఏమో రెండు పార్టీలపైన తనదైన పద్దతిలో విరుచుకుపడటం ఖాయం. కాకపోతే టాప్ ప్రయారిటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలకే దక్కుతాయనటంలో సందేహంలేదు. మరి మధ్యలో బీజేపీ ఎంతవరకు అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఏ మేరకు లబ్దిపొందుతుందో చూడాలి.