Begin typing your search above and press return to search.

నా కొడుకుని చంపేస్తామని బెదిరిస్తున్నారు... బీఆరెస్స్ నేత సంచలన వ్యాఖ్యలు!

ఈ సమయంలో ఒక వీడియో విడుదల చేసిన షకీల్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 21 ఏళ్ల వయసున్న తన కుమారుడు తప్పు చేస్తే చట్టప్రకారం ఉరి తీసినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.

By:  Tupaki Desk   |   17 April 2024 1:02 PM GMT
నా కొడుకుని చంపేస్తామని బెదిరిస్తున్నారు...  బీఆరెస్స్  నేత సంచలన వ్యాఖ్యలు!
X

తన కుమారుడు రాహిల్‌ పై అక్రమంగా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ రాజకీయ కక్షతోనో, మరే విధంగానో తమను హింసిస్తున్నారని ఆరోపించారు. కేసు విచారణ పారదర్శకంగా జరిపంచాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.

అవును... గతకొన్ని రోజులుగా బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి సంబంధించిన కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటన కేసు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఒక వీడియో విడుదల చేసిన షకీల్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 21 ఏళ్ల వయసున్న తన కుమారుడు తప్పు చేస్తే చట్టప్రకారం ఉరి తీసినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.

కానీ... తనపై ఉన్న రాజకీయ వైరంతో కానీ, మరో కారణంతోకానీ తన కుమారుడు చేయని తప్పుకు బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో తనతో డీసీపీ విజయ్ కుమార్ కు ఉన్న శతృత్వం ఏమిటో చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ ఘటనలో తన కుమారుడు కారు డ్రైవ్ చేయలేదని అన్నారు. నిజంగా తన కుమారుడు తప్పు చేస్తే మరి నాడు ఆ కేసు విచారించిన పోలీస్ అధికారులు, కమీషనర్ సీవీ ఆనంద్ లు తప్పుగా విచారించారని భావించాలా అని ప్రశ్నించారు!

అందువల్లే సీబీఐ తో కానీ.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో తనను కూడా ఎఫ్.ఐ.ఆర్. లో నిందితుడిగా చేర్చారని అన్నారు! ఈ సమయంలో సుమారు 20 మందికి పైగా పోలీసులు తన కుమారుడిని ఫిజికల్ గా మెంటల్ గా వేదించారని.. ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన సమయంలో డ్రైవింగ్ చేస్తున్నట్లు ఒప్పుకోమని బెదిరిస్తున్నారని అన్నారు!

ఒక టెర్రరిస్టుని విచారణ చేసినట్లుగా తన కుమారుడిని విచారిస్తున్నారని.. నిజంగా తన కుమారుడు తప్పు చేస్తే చట్ట ప్రకారం ఉరి శిక్ష వేయొచ్చని, అందుకు తాను పూర్తిగా సహకరిస్తాను అని.. అయితే... ఇలా బెదిరించి, బలవంతపెట్టి, తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. తన కుమారుడికి ఏమైనా జరిగితే అందుకు కారణం డీసీపీ విజయ్ కుమార్ తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు అంటూ వారి పేర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.